Swati Maliwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఏం జరిగింది!?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ తనపై దాడి చేసినట్లు రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ స్వాతీమాలీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం కేజ్రీవాల్ ఇంట్లో, సీఎం ఆదేశాలతోనే బిభవ్ తనపై అటాక్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Swati Maliwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఏం జరిగింది!?
New Update

Swati Maliwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సన్నిహిత వర్గంపై ఆప్‌ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ స్వాతీమాలీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ పీఏ తనపై భౌతికదాడికి పాల్పడ్డాడంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ అటాక్ కేజ్రీవాల్ ఇంట్లోనే, సీఎం కనుసన్నల్లోనే జరిగినట్లు స్వాతీమాలీవాల్ ఆవేదన వ్యక్తం చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

ముఖ్యమంత్రి ఆదేశాలతోనే దాడి..
ఈ మేరకు సోమవారం ఉదయం కేజ్రీవాల్‌ పీఏ బిభవ్ కుమార్‌ తనపై దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ స్వాతీమాలీవాల్ ఫోన్ చేసినట్లు పోలీసులు వెల్లడించినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆదేశాలతోనే బిభవ్ తనపై ఈ దారుణానికి పాల్పడ్డట్లు ఆమె కంప్లైట్ చేయడంతో వెంటనే పోలీసులు సివిల్‌ లైన్స్‌లో కేజ్రివాల్ ఇంటికి వెళ్లి పరిశీలించగా స్వాతీమాలీవాల్ అక్కడ కనిపించలేదని పేర్కొన్నాయి. అంతేకాదు కొద్దిసేపటికి క్రితమే ఫిర్యాదు చేస్తానని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన స్వాతీ.. వెంటనే స్టేషన్ నుంచి వెళ్లిపోయినట్లు పోలీసు వర్గాలు తెలపడం విశేషం. కాగా దీనిపై ఢిల్లీ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

బీజేపీ ఐటీ సెల్‌ హెడ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ.. 'ఢిల్లీ సీఎం సహాయకుడు దాడి చేశారని ఆప్‌ ఎంపీ స్వాతీమాలీవాల్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటినుంచి పోలీసులకు కాల్‌ వెళ్లింది. ఇప్పుడు మీకు ఈ విషయాలు గుర్తుకువస్తున్నాయా? కేజ్రీవాల్ అరెస్టుపై ఆమె మౌనం వహించారు. అప్పుడు ఆమె భారత్‌లో కూడా లేరు. చాలా రోజుల పాటు స్వదేశానికి తిరిగి రాలేదు’ అంటూ పరోక్షంగా కేజ్రీవాల్ తీరుపై విమర్శలు చేశారు.

ఇదిలావుంటే.. 2007 నాటి క్రిమినల్‌ కేసులో కేజ్రీవాల్‌ పీఏ బిభవ్ కుమార్‌పై ఇటీవలే వేటు పడింది. బిభవ్ కుమార్‌ నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ గుర్తించి అతడ్ని తక్షణమే విధుల్లో నుంచి తొలగించింది. 2007లో విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై బిభవ్ కుమార్‌ దాడి చేశాడని 2007లో నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అరవింద్ కేజ్రీవాల్‌కు పర్సనల్ సెక్రటరీగా నియామకం జరిగే సమయంలో ఈ కేసు వివరాలను బిభవ్ కుమార్ వెల్లడించలేదని విజిలెన్స్ విభాగం చేపట్టిన దర్యాప్తులో వెల్లడికావడంతో బిభవ్ కుమార్ ను విధులనుంచి తొలగించింది.

#kejriwal #swatimaliwal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe