Swati Maliwal Assault Case: ఎంపీపై దాడి కేసు.. కేజ్రీవాల్‌ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలీసులు

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై జరిగిన దాడి కేసులో ఈరోజు సీఎం కేజ్రీవాల్ తల్లిదండ్రులను పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. సీఎం తల్లిదండ్రులతో పాటు ఆయన సతీమణి సునీత నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

New Update
Swati Maliwal Assault Case: ఎంపీపై దాడి కేసు.. కేజ్రీవాల్‌ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలీసులు

Swati Maliwal Assault Case: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్ దాడి వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం నివాసంలోనే తనపై దాడి జరిగినట్లు ఎంపీ ఫిర్యాదు చేయడంతో అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో సీఎం కేజ్రీవాల్‌ తల్లిదండ్రులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.

తన తల్లిదండ్రులను పోలీసులు విచారించడంపై సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ (X)లో పోస్ట్ చేశారు. ఆయన ట్విట్టర్ లో.. "అనారోగ్యంతో బాధపడుతున్న తన వృద్ధ తల్లిదండ్రులను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు: అంటూ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సివిల్‌ లైన్స్‌లోని కేజ్రీవాల్‌ అధికారిక నివాసానికి పోలీసులు రానున్నట్లు తెలుస్తోంది. సీఎం తల్లిదండ్రులతో పాటు ఆయన సతీమణి సునీత నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు