Swastika Symbol: ఇలా చేస్తే నరదృష్టి దెబ్బకి పోతుంది.. ఇంటి ముందు ఇలా చేయండి

నరఘోష, నరపీడ, ఎదుటివాళ్ళ ఏడుపులు ఇవన్నీ కూడా నశించి పోవాలంటే.. ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ మీద ఓంకారం, స్వస్తిక్, త్రిశూలం ఈ గుర్తులు ఉండాలని పండితులు చెబుతున్నారు. వీటిని చెక్కించి కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం వీలు కానప్పుడు గంధంతో రాసుకోవాలని చెబుతున్నారు.

New Update
Swastika Symbol:  ఇలా చేస్తే నరదృష్టి దెబ్బకి పోతుంది.. ఇంటి ముందు ఇలా చేయండి

Swastika Symbol: ఆచారం ఓల్డ్‌ కావచ్చు.. కానీ రిజల్ట్‌ మాత్రం పక్కా.. ఇది పూర్వకాలంలో మన పెద్దలు ఆచరించే పద్దతుల్లో ఉండేది. ఈ మధ్యకాలంలో ప్రతిదానిని సైంటిఫిక్ రిజల్ట్ గా చూస్తున్నారు. అయితే ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే చిన్నచిన్న పద్దతులు పాటించేవారు. దీనివల్ల సమస్య తగ్గటంతోపాటు మంచి ఫలితం ఉండేది. మనం ఎదుగుతున్నామంటే ఏడ్చేవాళ్ల చాలామంది ఉంటారు. అంతేకాదు మన మీద నరదృష్టి ఉంటూ మనల్నీ ఎదగకుండా చేస్తుంది. అలాంటి సమస్య తగ్గాలంటే .. స్వస్తిక్ ఒక్కకే మార్గం.

సాంప్రదాయంలో కొన్ని ఆచరించాలి.. కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. అన్ని సైంటిఫిక్‌గా చూడకూడదు. అయితే ఈ మధ్య కాలంలో దేవుడన్నా, సాంప్రదాయాలన్న పెద్దగా పట్టించుకోని వాళ్ళు కొందరున్నారు. అలాంటి వాళ్ళకు మనం ఏం చెప్పినా గాని నమ్మరు. కానీ హిందూధర్మంలో మనకి కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నటే.. పరిహార శాస్త్రంలో కూడా కొన్ని రెమెడీస్ చేస్తే మనకి కచ్చితంగా ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాంటి వాటిల్లో స్వస్తిక్ ఒకటి. స్వస్తిక్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. దీనిని ఇంటి ముందు ఎంట్రన్స్‌లో పెట్టుకుంటే నరదృష్టి నుంచి విముక్తి కలుగుతుందట. స్వస్తిక్‌ను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఎలా పెట్టుకోవాలో దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ ముందు ఓంకారము, స్వస్తిక్, త్రిశూలం అనే ఈ మూడు గుర్తులు ఉంటాయో.. వాళ్ళకి భయంకరమైనటువంటి నరదృష్టి ఉన్నా సరే   మొత్తం నశించిపోతుంది. నరగోష, నరపీడ, ఎదుటివాళ్ళు ఏడుపులు ఇవన్నీ కూడా నశించి పోతాయి. ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ మీద ఓంకారం, స్వస్తిక్, త్రిశూలం ఈ గుర్తులను చెక్కించి కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం వీలు కానప్పుడు కనీసం గంధంతో అయినా ఈ మూడు గుర్తులను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి దృష్టిదోషం మీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపదని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగిందని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: ఈ చిన్న చిట్కాతో మీ పాదాలు మరింత అందంగా..

Advertisment
తాజా కథనాలు