AP TET 2024 Results: ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలపై లేటెస్ట్ అప్డేట్ ఇదే!

ఏపీలో డీఎస్సీ ఎగ్జామ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో టెట్ అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. టెట్ ఫలితాలు విడుదల చేయకపోవడంతో పాటు ఎన్నికల ఎఫెక్ట్ తో డీఎస్సీ ఎగ్జామ్స్ కూడా వాయిదా వేసే అవకాశం ఉంది. ఈసీ పర్మిషన్ ఇస్తేనే ఎగ్జామ్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

AP TET 2024: టెట్ సిలబస్ ఇదే.. ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన!
New Update

AP TET 2024: ఏపీలో డీఎస్సీ ఎగ్జామ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో టెట్ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటివరకూ టెట్ రిజల్ట్స్ రాకపోవడంతో అభ్యర్థులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 14వ ఫలితాలు విడుదకావాల్సివున్నప్పటికీ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోడ్ రావాడంతో టెట్ ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈసీ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాతే విడుదల చేస్తామని స్పష్టం చేసింది.

ఈసీ పర్మిషన్ ఇస్తేనే..
ఈ మేరకు ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్షలు(DSC Exams) నిర్వహించాలని తెలిపారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన వివరాలను ఈసీకి పంపిస్తామన్నారు. ఈసీ పర్మిషన్ ఇస్తేనే డీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించాలని సూచించారు. దీంతో డీఎస్సీ పరీక్షల నిర్వహణపై కూడా అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఇక మార్చి 13న ఫైనల్ కీ విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిఇందే.

తేదీలన్నీ మారే అవకాశం..
ఇదిలావుంటే.. డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్ లో మార్చి 30 నుంచి ఎగ్జామ్స్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. మార్చి 20న అభ్యర్థులు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్‌ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంచారు. మార్చి 25 నుంచి అభ్యర్థులు డీఎస్సీ హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 3 వరకూ ఈ పరీక్షలు నిర్వహించి.. ఏప్రిల్‌ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్‌ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ స్కూల్‌ అసిస్టెంట్‌, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ నోటిఫికేషన్ లో తెలిపింది. అయితే ఎన్నికల కారణంగా ఈ తేదీలన్నీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

#ap-tet-results #dsc-exams
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి