Congress Politics: పటాన్ చెరు కాంగ్రెస్ లో గందరగోళం.. బీఫామ్ ఎవరికి?

పటాన్ చెరు కాంగ్రెస్ అభ్యర్థి మార్పు ఖాయమన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అభ్యర్థిగా ప్రకటించిన నీలం మధుకు ఇంత వరకు బీఫామ్ ఇవ్వకపోవడంతో ఏదైనా జరగవచ్చని గాంధీభవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

New Update
Congress Politics: పటాన్ చెరు కాంగ్రెస్ లో గందరగోళం.. బీఫామ్ ఎవరికి?

ఓ వైపు రేపు నామినేషన్ల గడువు ముగుస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇంకా ఐదు టికెట్లపై క్లారిటీకి రావడం లేదు. తుంగతుర్తి, సూర్యాపేట, చార్మినార్, మిర్యాలగూడ టికెట్లను ఇంకా ఫైనల్ చేయలేదు ఆ పార్టీ హైకమాండ్. అయితే.. ఇప్పటికే ప్రకటించిన పటాన్ చెరు టికెట్ ను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నీలం మధు పేరు ఇప్పటికే ప్రకటించినా.. ఇంత వరకు బీఫామ్ మాత్రం ఇవ్వలేదు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ ఒత్తిడితో కాట శ్రీనివాస్ గౌడ్ కు బీఫామ్ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే.. ఈ ఇద్దరు అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిని ఓడిస్తే నరేందర్ రెడ్డికి ప్రమోషన్.. కొడంగల్‌లో కేటీఆర్ సంచలన ప్రకటన!

కాట శ్రీనివాస్ గౌడ్ తరఫున ఆయన భార్య కాట సుధారాణి నిన్న నామినేషన్ వేయగా.. నీలం మధు ముదిరాజ్ తరుఫున ఆయన భార్య కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఇదే జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ సీనయర్ నేతలు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి పటాన్ చెరు టికెట్ ను ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. నీలం మధు టికెట్ ను మారిస్తే ఊరుకునేది లేదని జగ్గారెడ్డి హైకమాండ్ కు స్పష్టం చేస్తుండగా.. కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన కాట మధుకే బీఫామ్ ఇవ్వాలని దామోదర రాజనర్సింహ స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Khammam Politics: కొత్తగూడెంలో బీఆర్ఎస్ కు షాక్.. రెబల్ గా బరిలోకి దిగనున్న జలగం?

దీంతో ఏం జరుగుతుందో తెలియక కేడర్ అయోమయంలో ఉన్నారు. ఇరు వర్గాలు మాత్రం బీఫామ్ మాకంటే మాకని ప్రచారం చేస్తున్నాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రికి మిగిలిన సీట్లకు అభ్యర్థుల పేర్ల విడుదలతో పాటు పటన్ చెరు టికెట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు