అమెరికాలో కాల్పుల కలకలం... మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం..!! అమెరికాలోని అట్లాంటా సమీపంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పోలీసులు కాల్చిచంపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. By Bhoomi 17 Jul 2023 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి అమెరికాలోని జార్జియాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. నలుగురు వ్యక్తులను కాల్చిచంపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పోలీసులు మట్టుబెట్టారు. ఎన్ కౌంటర్ లో షెరీఫ్ డిప్యూటీ, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. ఈ ఘటనపై హెన్నీ కౌంటీ షెరీఫ్అధికారికి సింటనియా మూర్ మాట్లాడుతూ ...దర్యాప్తు సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. జార్జియా యొక్క ప్రధాన నగరానికి దక్షిణంగా ఉన్న హాంప్టన్ యొక్క నిశ్శబ్ద ఉపవిభాగంలో శనివారం ఉదయం కాల్పులు కలకలం రేపాయి. లాంగ్‌మోర్‌ను అరెస్టు చేసే ప్రయత్నంలో హెన్రీ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ, క్లేటన్ కౌంటీ పోలీసు అధికారి గాయపడ్డారని, లాంగ్‌మోర్‌ను క్లేటన్ కౌంటీకి సమీపంలో ఉన్న ప్రాంతంలోని దళాలు హతమార్చాయని మూర్ చెప్పారు. అట్లాంటా శివారులో హాంస్టన్ లో చాలా మందినికాల్చిచంపినట్లు లాంగ్ మోర్ పై ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసుల్లో అతడు వాంటెడ్ గా ఉన్నట్లు వెల్లడించారు. జార్జియా రాష్ట్రంలో అట్లాంటాకు దక్షిణంగా ఉన్న ఒక చిన్న కమ్యూనటీలో సామూహిక కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. అట్లాంటాకు దక్షిణాన 40మైళ్ల దూరంలో ఉన్న హాంస్టన్ శనివారం ఉదయం ఈఘటన జరిగిందని హెన్రీ కౌంటీ అధికారి తెలిపారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి