Sushant Singh: రాజ్ పుత్ కేసులో రియాకు ఊరట.. సీబీఐ సర్క్యూలర్‌ రిజెక్ట్!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సూసైడ్ కేసులో నటి రియా చక్రవర్తికి ఊరట లభించింది. ఆమె ఫ్యామిలీపై సీబీఐ జారీ చేసిన లుక్‌అవుట్‌ సర్క్యూలర్‌ (ఎల్‌ఓసీ)ని ముంబై హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ ఆర్డర్‌పై స్టే విధించాలన్న సీబీఐ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని తిరస్కరించింది.

New Update
Sushant Singh: రాజ్ పుత్ కేసులో రియాకు ఊరట.. సీబీఐ సర్క్యూలర్‌ రిజెక్ట్!

Rhea Chakraborty: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) సూసైడ్ కేసులో నటి రియా చక్రవర్తికి (Rhea Chakraborty) ఊరట లభించింది. ఆమె ఫ్యామిలీపై సీబీఐ జారీ చేసిన లుక్‌అవుట్‌ సర్క్యూలర్‌ (ఎల్‌ఓసీ)ను ముంబూ హైకోర్టు రద్దు చేసింది.

ఈ మేరకు గురువారం దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం లుక్ అవుట్ సర్కూలర్ ను రద్దు చేస్తూ అదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేసేందుకు నాలుగు వారాలపాటు ఈ ఆర్డర్‌పై స్టే విధించాలన్న సీబీఐ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది.

ఇది కూడా చదవండి: Shraddha Das: బ్లాక్ డ్రెస్ లో శ్రద్దా దాస్ హాట్ ఫోజులు.. వైరలవుతున్న ఫొటోస్

అసలేం జరిగింది..
యంగ్ హీరో సుశాంత్‌ 2020 జూన్‌ 14న ముంబైలో తన నివాసంలో సూసైడ్ చేసుకున్నాడు. అయితే సూశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, రియా చక్రవర్తి వల్లే చనిపోయాడంటూ ఆమె కుటుంబంపై కేసు పెట్టారు. అంతేకాదు సుశాంత్‌ అకౌంట్ నుంచి రూ. 15 కోట్లు బదిలీ చేసుకున్నారని సుశాంత్ తండ్రి కేకే సింగ్‌ ఆరోపించారు.

అయితే ఈ కేసులో మనీలాండరింగ్‌ జరిగినట్లు భావించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రియాను ప్రశ్నించింది. ఆ తర్వాత, కేసును సీబీఐకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సుశాంత్‌కు రియా డ్రగ్స్ ఇచ్చినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈ క్రమంలోనే రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ ఎల్‌వోసీ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజా తీర్పుతో వారికి ఉపశమనం లభించింది.

Advertisment
తాజా కథనాలు