తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్..
పూర్తిగా చదవండి..తమిళ సూపర్ స్టార్ సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయనకు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య నటించిన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు రాబడతాయి. ముఖ్యంగా ఆయన నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది. 2008లో వచ్చిన ఈ మూవీలో సూర్య డబుల్ రోల్లో అదరగొట్టాడు. ఇక హారిస్ జైరాజ్ జైరాజ్ ఇచ్చిన మూవీ సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయాయి. ఇప్పటికీ ఎక్కడో చోట ఆ సినిమా పాటలు మార్మోగుతూనే ఉంటాయి. ఈ సినిమా విడుదలై 15 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈనెల 4న సినిమాను థియేటర్లలో రీరిలీజ్ చేశారు.
This love is a huge surprise!!!
A big thank you from team #SuriyaSonOfKrishnan
Awestruck – you guys are the best!! ❤️ pic.twitter.com/N2zrxpmKrp— Suriya Sivakumar (@Suriya_offl) August 5, 2023
మీ అభిమానానికి ఆశ్చర్యపోయాను..
ఈ సందర్భంగా థియేటర్స్‌లో ఫ్యాన్స్ చేసిన సందడి అంత ఇంత కాదు. పాటలకు డ్యాన్సులు వేస్తూ హల్చల్ చేశారు. ‘అది నన్నే చేరవచ్చే చంచలా’ సాంగ్‌కు అయితే పాట పాడుతూ స్క్రీన్ దగ్గరకు వెళ్లి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలెక్షన్లు కూడా అదరగొట్టాయని మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్ అభిమానంపై సూర్య స్పందిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు. ‘మీ ప్రేమాభిమానాలకు ఆశ్చర్యపోయాను. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ బెస్ట్ అంటూ’ థియేటర్లో అభిమానుల సందడి చేస్తున్న వీడియోను ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
రికార్డు కలెక్షన్స్ ..
ఆగస్టు 4న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే కోటి రూపాయల గ్రాస్ అందుకున్న చిత్రాల జాబితాలో చేరింది. దీంతో ఇతర భాషల నుంచి రీరిలీజ్ అయ్యి ఈ రికార్డు సాధించిన మొదటి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే 24 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయంటే ఈ కల్ట్ క్లాసిక్ చిత్రానికి ఎలాంటి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. రీరిలీజ్‌కు వస్తున్న క్రేజీ రెస్పాన్స్ చూసి సినిమాను మరికొన్ని రోజులు థియేటర్లలోనే ఉంచాలని మూవీ టీమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
సూర్య ద్విపాత్రాభినయంలో వచ్చిన ఈ మూవీలో సిమ్రాన్, సమీరారెడ్డి కథానాయికలుగా నటించారు. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో సూర్య ‘కంగువా’చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
[vuukle]