Kanguva : రెండు భాగాలుగా సూర్య 'కంగువ'.. కన్ఫర్మ్ చేసిన నిర్మాత, అప్పుడే పార్ట్-2 షూటింగ్ కూడా! కోలీవుడ్ స్టార్ సూర్య 'కంగువా' మూవీ రెండు భాగాలుగా రాబోతుందట. ఈ విషయాన్నినిర్మాత జ్ఞానవేల్ రాజా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. 2025 చివరలో కానీ 2026 మొదట్లో కానీ పార్టు 2 సెట్స్‌పైకి వెళ్తుంది. 2027 వేసవిలో రిలీజ్ చేస్తాం' అని చెప్పుకొచ్చారు. By Anil Kumar 09 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Suriya Kanguva Will Be In Two Parts : ఈ మధ్య సౌత్ స్టార్ హీరోల సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు కోలీవుడ్, మాలీవుడ్ వరకు చేరింది. రీసెంట్ టైమ్స్ లో మన తెలుగులో చూసుకుంటే పుష్ప,దేవర, సలార్, కల్కి వంటి సినిమాలు రెండు భాగాలుగా వస్తున్నాయి. అటు తమిళంలో ఇండియన్ మూవీ సీక్వెల్ 'ఇండియన్ 2' ఈ వారంలోనే రిలీజ్ కాబోతుంది. ఇక తాజాగాఈ లిస్ట్ లో కోలీవుడ్ స్టార్ సూర్య 'కంగువ' మూవీ కూడా చేరింది. కుంగువ సినిమాను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట మేకర్స్. సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కంగువా. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సూర్య లుక్, టీజర్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశాయి.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సూర్య ఐదు విభిన్న తరహా పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా అక్టోబర్ 10 న రిలీజ్ కాబోతుంది. Also Read : ప్రభాస్ ‘కల్కి’ పై మహేష్ ప్రశంసలు.. వైరల్ అవుతున్న ట్వీట్! రెండు భాగాలుగా.. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేం పార్టు 1, పార్టు 2 కోసం కథ రాశాం. కొన్ని ఎక్జయిటింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులు పార్టు 2ను ఫాలో అయ్యేలా చేస్తాయి. పార్టు 1 కోసం 185 రోజులు షూట్ చేశాం. 2025 చివరలో కానీ 2026 మొదట్లో కానీ పార్టు 2 సెట్స్‌పైకి వెళ్తుంది. 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం" అని చెప్పుకొచ్చారు. దీంతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. #kanguva-movie #suriya #kanguva-in-2-parts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి