Kanguva : సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'కంగువ' రిలీజ్ డేట్ వచ్చేసింది..!

సూర్య 'కంగువ' మూవీ దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని 2024 అక్టోబర్‌ 10న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో సూర్య వారియర్ గా కత్తి పట్టుకున్న లుక్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది.

Kanguva : సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'కంగువ' రిలీజ్ డేట్ వచ్చేసింది..!
New Update

Suriya Kanguva Movie Release Date Out : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కంగువా. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సూర్య లుక్, టీజర్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశాయి.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సూర్య ఐదు విభిన్న తరహా పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా పడింది. సూర్య ఫ్యాన్స్ ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మేకర్స్ రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇచ్చారు.

Also Read : ‘కల్కి’ తెచ్చిన తంటా.. కర్ణుడు Vs అర్జునుడు సోషల్ మీడియాలో మొదలైన ఫ్యాన్ వార్!

దసరా కానుకగా...

'కంగువ' దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని 2024 అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో సూర్య వారియర్ గా కత్తి పట్టుకున్న లుక్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. పోస్టర్ చూస్తుంటే సినిమాలో సూర్య రోల్ అతని కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచే ఛాన్స్ ఉంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ 38 భాషల్లో విడుదల కానుంది.

#suriya #kanguva-movie #kanguva-movie-release-date
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe