సంతోషం అవార్డ్స్ వేడుక వివాదంపై సురేష్ కొండేటి రియాక్షన్ ఇదే.!

సంతోషం అవార్డ్స్ వేడుక వివాదంపై సురేష్ కొండేటి స్పందించారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మంది సెలబ్రిటీస్ కి రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగిందని.. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సంతోషం అవార్డ్స్ వేడుక వివాదంపై సురేష్ కొండేటి రియాక్షన్ ఇదే.!
New Update

Santosham Awards Ceremony Controversy: జర్నలిస్టు, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి (Suresh Kondeti) ప్రతి ఏటా సంతోషం అవార్డు(Santosham Awards)ల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది గోవాలో ఆ అవార్డ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుక కోసం దక్షిణాది నుంచి సినీ సెలబ్రెటిస్, మీడియా ప్రతినిధులను గోవాకు తీసుకెళ్లారు. అయితే, ఈ ఈవెంట్ నిర్వహణలో కన్నడ ప్రముఖులకు చేదు అనుభవం ఎదురైందని విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేజ్ మీద కన్నడ సెలెబ్రిటీలను అవమానించారని, కనీసం రూం బిల్లులు కూడా చెల్లించలేదని నానా రకాలుగా కన్నడ ప్రతినిధులు సంతోషం అవార్డు వేడుకపై విమర్శలు చేస్తూ టాలీవుడ్‌ను తప్పుపడుతున్నారట. దీంతో సోషల్ మీడియాలో సంతోషం అవార్డ్స్ వేడుక వివాదంపై రచ్చ రచ్చ జరుగుతోంది.

Also read: నీ నిజస్వరూపం ఇదే.! నువ్వు మోసపోలే.. నీ చేతిలో నేను మోసపోయా..!

కాగా, టాలీవుడ్ పై చేస్తున్న విమర్శల మీద అల్లు అరవింద్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఎవరో ఒకరు చేసిన దానికి మొత్తం టాలీవుడ్‌కు ఆపాదించడం కరెక్ట్ కాదని అన్నాడు. అది అతని వ్యక్తిగతం అని టాలీవుడ్‌ను నిందించడం కరెక్ట్ కాదని సూచించారు. తెలుగు చిత్ర పరిశ్రమ మీద విమర్శలు చేస్తుండటం బాధగా అనిపించిందని అన్నారు. అతను ఎవరికీ పీఆర్వో కాదని.. మాకు, మా కుటుంబానికి పీఆర్వో కాదని అల్లు అరవింద్ స్పష్టం చేశాడు.

తాజాగా, ఈ వివాదంపై సురేష్ కొండేటి స్పందించాడు. ‘అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను .. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు .. ప్రతి సం చాలా కష్టపడి, గ్రాండ్ గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను .. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే .. అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నాను.

గోవా ఈవెంట్ లో జరిగిన కొంచం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్ కి రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్ లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్ , అది ఉదేశ్య పూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను నా మీద కావాలనే కొంత మంది కావాలని బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ సురేష్ కొండేటి’ అని ట్వీట్ వేశాడు.

మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో.. సినీ పెద్దలు ఈ వివాదం మీద రియాక్ట్ అవుతారో లేదో చూడాలి. మున్ముందు ఈ సంతోషం అవార్డు వేడుకల మీద ఏమైనా ఆంక్షలు విధిస్తారేమో అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.

#controversy #santosham-awards #suresh-kondeti #tolly-wood-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe