Surekha Vani : షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చిన సురేఖా వాణి.. ఏకంగా అతడితో కలిసి నైట్ పార్టీ!

సురేఖా వాణి తాజాగా షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించి ఓ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందుకు కారణం ఈ పిక్ లో బాలీవుడ్ సోషల్ మీడియా సెలెబ్రిటీ ఓరీతో కనిపించడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఫోటో చూస్తుంటే ఇది నైట్ పార్టీలో చిల్ అవుతూ దిగిన ఫోటోగా కనిపిస్తుంది.

Surekha Vani : షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చిన సురేఖా వాణి.. ఏకంగా అతడితో కలిసి నైట్ పార్టీ!
New Update

Surekha Vani In Shocking Look : సినీ నటి, క్యారెక్టర్ ఆరిస్ట్ సురేఖా వాణి గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఓ షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించి ఓ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందుకు కారణం ఈ పిక్ లో బాలీవుడ్ సోషల్ మీడియా సెలెబ్రిటీ ఓరీతో కనిపించడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

సురేఖావాణి భుజంపై చేయి వేసి క్లోజ్‌గా ఉన్న వ్యక్తి పేరు ఓరీ. గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్‌ సెలబ్రిటీలతో కనిపిస్తున్నాడు. నిజానికి ఇతను చేసే పనెంటో పెద్దగా తెలియదు. కానీ హిందీ హీరోయిన్లతో క్లోజ్ గా కనిపిస్తుంటాడు. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి హీరోయిన్లతో ఎప్పుడూ అంటిపెట్టుకుని కనిపిస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు తెలుగు నటి సురేఖా వాణితో కనిపించడంతో నెటిజన్స్ అంతా దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు.

Also Read : పవన్ కళ్యాణ్ కు విషెష్ తెలిపిన రేణు దేశాయ్.. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన అకీరా,ఆద్య!

వీళ్లిద్దరు ఎక్కడ కలిశారు? ఎందుకు కలిశారు? అనేది తెలియక పోయినా ఫోటో చూస్తుంటే ఇది నైట్ పార్టీలో చిల్ అవుతూ దిగిన ఫోటోగా కనిపిస్తుంది. ఈ నైట్ పార్టీ హైదరాబాద్ లో జరిగిందా? లేక ముంబై లో జరిగిందా ? అనేది స్వయంగా సురేఖ వాణి క్లారిటీ ఇస్తే తప్ప తెలీదు.

#surekha-vani-shocking-look #actress-surekha-vani
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe