మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Big Breaking: అక్టోబర్ 3న సుప్రీం కోర్టు ముందుకు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్..
New Update

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ట్యాంపర్ చేశారన్న కేసులో జడ్జి జయకుమార్ కీలక తీర్పు ఇచ్చారు. శ్రీనివాస్‌గౌడ్‌ సహా 10మందిపై FIR పెట్టాలని మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వీరిలో కొంత మంది ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కూడా కేసు పెట్టాలని ఆదేశించారు. ఈ తీర్పుపై ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాజ్యాంగబద్దంగా ఏర్పడ్డ వ్యవస్థలపై ఎలా కేసులకు ఆదేశిస్తారని ఆగ్రహం వ్యక్తంచేసింది. అనంతరం జడ్జిని సస్పెండ్ చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

2018 ఎన్నికల సమయంలో శ్రీనివాస్‌ గౌడ్ నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌ను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పెట్టింది. అయితే అనంతరం పాత అఫిడవిట్ స్థానంలో కొత్తది అప్‌లోడ్ చేశారనే ఆరోపణలున్నాయి. ట్యాంపరింగ్ చేశారని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన చలువగాలి రాఘవేంద్రరాజు అనే వ్యక్తి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశారు. సదరు ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జడ్జి జయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్​ఐఆర్​ వివరాలను కోర్టుకు సమర్పించాలని.. లేదంటే కోర్టు ధిక్కారణ కింద పరిగణిస్తామని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జడ్జి జయకుమార్‌ను సస్పెండ్ చేసింది.

ఇక శ్రీనివాస్ గౌడ్ ఈసారి కూడా మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ విడుదల చేసిన జాబితాలో మహబూబ్ నగర్ స్థానం ఆయనకు కేటాయించారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన శ్రీనివాస్ గౌడ్ మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన క్రీడా శాఖతో పాటు ఎక్సైజ్ శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe