Supreme Court: పెళ్లి ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడం మోసం కాదు: సుప్రీంకోర్టు

పెళ్లి ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడం మోసం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివాహ ప్రతిపాదన మొదలై.. అది కార్యరూపం దాల్చకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చని పేర్కొంది. కర్ణాటకకు చెందిన వ్యక్తిపై నమోదైన చీటింగ్‌ కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

New Update
Breaking: పోస్టల్‌ బ్యాలెట్‌ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వైసీపీ
Supreme Court: పెళ్లి ప్రతిపాదన మొదలై.. అది కార్యరూపం దాల్చకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చీటింగ్‌ కేసు కింద నేరం రుజువు చేయాలంటే.. మోసం చేయాలనే ఉద్దేశం మొదటి నుంచీ ఉండాలనే విషయాన్ని న్యాయస్థానం గుర్తుచేసింది. కర్ణాటకకు చెందిన వ్యక్తిపై నమోదైన చీటింగ్‌ కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
తనను పెళ్లి చేసుకోకుండా రాజు అనే వ్యక్తి మోసం చేశాడని పేర్కొంటూ కర్ణాటకకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహం నిశ్చయమైన తర్వాత తామిద్దరం తరచూ ఫోన్‌లోనూ మాట్లాడుకున్నామని తెలిపింది. కళ్యాణ మండపం కోసం తన తండ్రి రూ.75వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారని.. చివరకు రాజు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు తెలిసిందని వాపోయింది. రాజుతో సహా ఆయన కుటుంబసభ్యులపై మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు.. యువకుడు రాజును  దోషిగా తేల్చింది.
అయితే, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ యువకుడు రాజు 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారించిన ధర్మాసనం.. గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఈ కేసులో యువతిని మోసం చేసే ఉద్దేశం రాజుకి ఉన్నట్లు కనిపించడం లేదని తెలిపింది. అందుకే సెక్షన్‌ 417 కింద దీన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది.
Advertisment
Advertisment
తాజా కథనాలు