Manish Sisodia: సిసోడియాను అలా జైల్లో ఉంచలేం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఎక్సైస్ పాలసీ కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను అలా నిరవధికంగా జైల్లో ఉంచలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. ఆయనపై మోపినటువంటి అభియోగాలను ట్రయల్ కోర్టులో ఎప్పుడు వాదనలు వినిపించడం ప్రారంభిస్తారని.. సీబీఐ, ఈడీల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ ఎస్.వి రాజును ధర్మాసనం ప్రశ్నించింది. సిసోడియాను ఇలా నిరవధికంగా జైల్లో ఉంచలేరని.. కేసులో ఒకసారి అభియోగంపత్రం దాఖలైతే దానిపై వెంటనే వాదనలు మొదలవ్వాల్సిందేనని తెలిపింది.

New Update
Manish Sisodia: సిసోడియాను అలా జైల్లో ఉంచలేం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Manish Sisodia cant be in Jail -  Supreme Court: మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కొన్నాళ్లుగా జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. మనీశ్ సిసోడియాను నిరవధికంగా జైలులో ఉంచలేమంటూ పేర్కొంది. ఆయనపై మోపినటువంటి అభియోగాలను ట్రయల్ కోర్టులో ఎప్పుడు వాదనలు వినిపించడం ప్రారంభిస్తారని.. సీబీఐ (CBI), ఈడీ (ED)ల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ ఎస్.వి రాజును ధర్మాసనం ప్రశ్నించింది. సిసోడియాను ఇలా నిరవధికంగా జైల్లో ఉంచలేరని.. కేసులో ఒకసారి అభియోగంపత్రం దాఖలైతే దానిపై వెంటనే వాదనలు మొదలవ్వాల్సిందేనని వ్యాఖ్యానించింది.
ఇప్పటివరకు అది ఎందుకు చేయలేదో మంగళవారం చెప్పాలంటూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. సిసోడియా బెయిల్ పిటిషన్లపై విచారణ చేసిన సందర్భంగా సుప్రీం ఈ విధంగా స్పందించింది. అయితే సిసోడియాపై ఉన్న కేసులు ప్రస్తుతం సీఆర్‌పీసీలో సెక్షన్ 207 దశ వద్ద ఉన్నాయని.. దాని తర్వాత వాదనలు ప్రారంభమవుతాయని ఎస్.వి రాజు తెలిపారు.

Also Read: మొయిత్రా లోక్‌సభ అకౌంట్‌ను చెక్‌ చేయాలి.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

అలాగే ఎక్సైజ్‌ సహా 18 శాఖలను చూస్తున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి.. లంచాలు తీసుకుంటే ఏం చేయాలనే దానిపై సరైన ఉదాహరణను చూపించాల్సిన అవసరం ఉందని వాదనల సందర్భంగా రాజు తెలిపారు. అలాగే నగదు అక్రమ చలామణీని రుజువుచేసే వాట్సప్‌ సంభాషణలు దొరికాయని.. దీనివల్ల బెయిల్‌ ఇవ్వరాదని వాదనలు చేశారు. సిసోడియాను విచారించడానికి ముందు అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ సెక్షన్‌ ప్రకారం ముందస్తు అనుమతి పొందారా అని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఇందుకు అవునని ఏఎస్‌జీ బదులిచ్చారు.

నగదు అక్రమ చలామణి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారమే ఆమ్‌ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చాలని దర్యాప్తు సంస్థలు యోచిస్తున్నాయని తెలిపారు. నగదు అక్రమ చలామణి, అవినీతి అభియోగాలు వేరువేరైనా అవి రెండూ ఒకే నేరానికి సంబంధించినవంటూ చెప్పారు. అయితే ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీపై వేరే అభియోగాలు ఏమైనా మోపుతారా అనేదానిపై మంగళవారం నాటికి స్పష్టతనివ్వాలని ధర్మాసనం సూచనలు చేసింది. మద్యం విధానాన్ని మార్చడం వల్ల కొంతమందికి లబ్ధి కలిగి, ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతుందనే ఆరోపణలపై న్యాయపరమైన ప్రశ్నలకు మంగళవారం సమాధానాలు చెప్పాలని సిసోడియా తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వికి తెలిపింది. చివరికి తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

Also Read: సేమ్ సెక్స్ వివాహాలకు ఓకే.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Advertisment
తాజా కథనాలు