ఓటుకు నోటు కేసు విచారణ.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఓటుకు నోటు కేసుకు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను జులై 24కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.

New Update
ఓటుకు నోటు కేసు విచారణ.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విషయమై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు పేరును చేర్చాలన్నది ఒక పిటిషన్ కాగా.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు ఆర్కే. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో అనేక సార్లు విచారణ జరిగినప్పటికీ.. అనేక సార్లు వాయిదా పడింది. ఈ రోజు ఈ పిటిషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జులై 24కు వాయిదా వేసింది. వేసవి సెలవుల అనంతరం ఈ కేసుపై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.

ఈ కేసు ఏంటి?
2015లో తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నించారని తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చర్చలు జరిపిన వీడియోను సైతం ఏసీబీ విడుదల చేయడంతో అది సంచలనంగా మారింది. ఆ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లారు.

ఈ సందర్భంగా చంద్రబాబు స్టీఫెన్ సన్ తో జరిపిన ఫోన్ సంభాషణలు కూడా బయటకు రావడంతో కేసు మరింత సంచలనంగా మారింది. నాటి సీఎం కేసీఆర్, అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఏపీలో దోచుకున్న డబ్బుతో చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisment
తాజా కథనాలు