Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్‌

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. ఈ రోజు ఆయనకు బెయిల్ వస్తుందని భావించిన ఆప్ శ్రేణులకు నిరాశే మిగిలింది. తీర్పును వాయిదా వేసింది న్యాయస్థానం.

New Update
Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్‌

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. ఈ రోజు ఆయనకు బెయిల్ వస్తుందని భావించిన ఆప్ శ్రేణులకు నిరాశే మిగిలింది. మధ్యంతర బెయిల్‌పై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మే 9న లేదా వచ్చే వారంలో మళ్లీ ఈ పిటిషన్ ను విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈడీ, కేజ్రీవాల్‌ తరఫున వాదనలను విన్న అనంతరం సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. మరోవైపు కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ పొడిగించింది.

మే 20 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి దాదాపు 45 రోజులుగా ఆయన తీహార్‌ జైలులోనే ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు రౌస్‌ అవెన్యూ కోర్టును కోరారు కేజ్రీవాల్‌. బెయిల్ ఇచ్చేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్ ను కూడా నిన్న రౌస్ అవెన్యూ కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు కవిత.

Advertisment
తాజా కథనాలు