BREAKING: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్

లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

New Update
CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కేనా?

CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి నిరాశే ఎదురైంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు గతంలో ఈ కేసులో ట్రయిల్ కోర్టు తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఇరువురు తరఫున లాయర్ల వాదనలు విన్న ధర్మాసనం సీఎం కేజ్రీవాల్ కు ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కాగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

లోక్ సభ ఎన్నికల్లో ప్రచారానికి..

లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న అరెస్ట్ అయ్యారు సీఎం కేజ్రీవాల్. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అనుమతి కోరుతూ సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను సుప్రీం కోర్టు మే 10న మంజూరు చేసింది. జూన్ 2వ తేదీన తిరిగి జైలులో లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది.

మద్యంతర బెయిల్ కు సమయం ముగియడంతో కేజ్రీవాల్.. తనకు అనారోగ్యంగా ఉందని.. ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను మరో వార్మ్ రోజులు పొడిగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆయన మధ్యంతర బెయిల్ పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. కాగా జూన్ 2న ఆయన తిరిగి జైలులో లొంగిపోయారు. కాగా ఇటీవల ఈ కేసులో దాదాపు 17 నెలల తరువాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

Advertisment
తాజా కథనాలు