Nominated MLC Posts: రేవంత్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది సుప్రీం కోర్టు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధించింది. కొత్తగా నియామకాలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దాసోజు తరఫున కపిల్ సిబల్ వాదించారు. వారి వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కొత్త నియామకాలు ప్రభుత్వ బాధ్యతని ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్ నామినేట్ చేయడాన్ని అడ్డుకోలేమని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే ఉంటుందని జస్టిస్ విక్రంనాథ్ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
మంత్రి పదవికి కోదండ రామ్‌కు లైన్ క్లియర్..!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో మరోసారి మంత్రి పదవులపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండ రామ్, అమీర్ అలీఖాన్‌లను నామినేట్ చేయగా గవర్నర్ ఆమోదించారు. కాగా వారి ఎన్నికపై స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే, తాజాగా సుప్రీం కోర్టు తీర్పుతో ఎమ్మెల్సీలుగా కోదండ రామ్, అమీర్ అలీఖాన్‌ల నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. గతంలో కోదండ రామ్ కు రేవంత్ కేబినెట్ లో చోటు దక్కుతుందని ప్రచారం జోరుగా సాగింది. విద్యాశాఖ మంత్రి పదవి కోదండ రామ్ కు ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో ఆరు మంత్రి పడవులు ఖాళీగా ఉన్నాయి. కాగా త్వరలో కోదండ రామ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.