తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు

తెలుగు రాష్ట్రాలతో పాటు ఏడు రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ఈమేరకు బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలిజీయం ఓ తీర్మానాన్ని పాస్ చేసింది. ఈ తీర్మానం కాపీని బుధవారం రాత్రి సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసింది. తెలంగాణ, ఏపీ, కేరళ, ఒడిశా, మణిపూర్, బాంబే, గుజరాత్ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌ల పేర్లను కొలీజియం ప్రతిపాదించింది.

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు
New Update

Supreme-Court-Collegium-proposes-new-Chief-Justices-for-seven-High-Courts-incluid-both-telugu-states

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరదే, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను కొలీజియం సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ అరదే.. 2009లో అక్కడి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2013లో అక్కడి హైకోర్టుకు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2022 జూన్‌ నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా కొనసాగుతున్నారు.

జస్టిస్ ధీరజ్ సింగ్ థాకూర్..

1964 ఏప్రిలో 25న జన్మించిన జస్టిస్ ధీరజ్ సింగ్ థాకూర్.. 1989లో ఢిల్లీ బార్ కౌన్సిల్ తో పాటు జమ్మూ కాశ్మీర్ బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు. 2013 సంవత్సరంలో జమ్మూకాశ్మీర్ హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. గతేడాది బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌కు ట్రాన్సఫర్‌ అవుతున్నారు. ప్రస్తుతం బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ థాకూర్ వ్యవహరిస్తున్నారు.

జస్టిస్ అలోక్ అరాదె..

జస్టిస్ అలోక్ అరాదె ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో 1964 ఏప్రిల్ 13న జన్మించారు. బీఎస్సీ, ఎల్ఎల్‌బీ పూర్తిచేసి 1988 లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2011లో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం 2016లో జమ్మూకాశ్మీర్ కోర్టుకు బదిలీ అయ్యారు. ఆపై 2018లో కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. గతేడాది జూలై 3 నుంచి కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన తెలుగు రాష్ట్రం తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ అలోక్ అరాదె నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు.

ఏ రాష్ట్రానికి ఎవరు..

  • గుజరాత్ హైకోర్టు.. జస్టిస్ సునీత అగర్వాల్. ప్రస్తుతం జస్టిస్ సునీత అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
  • ఒడిశా హైకోర్టు.. జస్టిస్ సుభాషిస్ తాలపత్ర. ప్రస్తుతం ఒడిశా హైకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
  • కేరళ హైకోర్టు.. జస్టిస్ ఆశిష్ జె దేశాయ్. ప్రస్తుతం గుజరాత్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
  • మణిపూర్ హైకోర్టు.. జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్. ప్రస్తుతం జస్టిస్ సిద్ధార్థ్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
  • ఏపీ హైకోర్టు.. జస్టిస్ ధీరజ్ సింగ్ థాకూర్. ప్రస్తుతం బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
  • తెలంగాణ హైకోర్టు.. జస్టిస్ అలోక్ అరాదె. ప్రస్తుతం ఆయన కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు.
  • బాంబే హైకోర్టు.. జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe