KCR: ఆ జడ్జిని మార్చేయండి.. సుప్రీంకోర్టులో కేసీఆర్‌కు బిగ్‌ రిలీఫ్‌!

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసిన సీఐజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

New Update
KCR: ఆ జడ్జిని మార్చేయండి.. సుప్రీంకోర్టులో కేసీఆర్‌కు బిగ్‌ రిలీఫ్‌!

తెలంగాణలో రేవంత్ సర్కార్ నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్‌ కమిషన్ చైర్మన్‌ను మార్చాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ తీరుపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. జూన్ 11న విచారణ పూర్తి కాకముందే కమిషన్ చైర్మన్ తన అభిప్రాయం చెప్పేశారని సీఐజే వ్యాఖ్యానించారు. జడ్జి నిస్పక్షపాతంగా ఉండాలన్నారు. కమిషన్ చైర్మన్ ను మార్చే అవకాశం ఇస్తున్నామని ప్రభుత్వానికి తెలిపారు. కొత్త జడ్జి పేరును మధ్యాహ్నం 2 గంటలకు చెబుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

దీంతో కాసేపట్లో కొత్త చైర్మన్ పేరు వెల్లడి కానుంది. సుప్రీంకోర్టులో కేసీఆర్‌ పిటిషన్‌పై హోరాహోరీగా వాదనలు జరిగాయి. కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున సింఘ్వీ వాదనలు వినిపించారు. కమిషన్ చైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టడాన్ని సీఐజే తప్పుబట్టినట్లు తెలుస్తోంది. కమిషన్ చైర్మన్ ప్రెస్‌మీట్ ఎలా పెడతారు? కమిషన్ చైర్మన్ తన అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేస్తారు? అంటూ సీఐజీ ప్రశ్నించినట్లు సమాచారం.

న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా, నిష్పక్షపాతంగా ఉండాలంటూ సీజేఐ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కమిషన్ చైర్మన్ మార్చాలన్న సుప్రీంకోర్టు సూచనను ప్రభుత్వం అంగీకరించింది. దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు కొత్త చైర్మన్ పేరును సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలపనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు