Supreme Court: రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అత్యున్నత ధర్మాసంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ధర్మాసనం సీరియస్ గా తీసుకుంది. దీనిపై మరోసారి సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.

New Update
Supreme Court: రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్

Supreme Court: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ మీద చేసిన వ్యాఖ్యల పై అత్యున్నత ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో 2015 నాటి ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణకు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే..ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీచేయాలంటూ కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై అత్యున్నత ధర్మాసం.. న్యాయవ్యవస్థపై ఇలాంటి అనుమానాలు వద్దని తెలిపింది. కేవలం ఏదో జరిగిపోతుందని.. ఊహాజనిత వ్యాఖ్యలు చేయడం న్యాయవ్యవస్థ పట్ల గౌరవం అన్పించుకోదని ధర్మాసనం గట్టిగానే తెలిపింది. తాము.. న్యాయబద్ధంగా మాత్రమే నడుచుకుంటామని, ఒకరు ప్రభావితం చేయడం వల్ల, మరే ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని తీర్పులు చెప్పబోమని పేర్కొంది.

ఈ నేపథ్యంలో.. కావాలంటే సీఎం రేవంత్ కేసు కోసం.. స్పెషల్ గా ఇండిపెండెంట్ ప్రాసిక్యుటర్ ను కూడా నియమించేందుకు ముందుకొచ్చింది. దీనిపైన ఇరువర్గాలకు 30 వ తారీకున ఏకాభి ప్రాయం రాకపోవడంతో..జస్టిస్ గవాయితో కూడిన ధర్మాసనం కేసును ఈరోజుకు కేసును వాయిదావేసింది.

ఈ నేపథ్యంలో సోమవారం రోజు.. సుప్రీంకోర్టులో మరోసారి ఓటుకు నోటు అంశంతో పాటు, సీఎం రేవంత్ సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరోక సారి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ పోస్టులపై పూర్తి వివరణ ఇవ్వాలని కూడా ధర్మాసనం తెల్చి చెప్పింది. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్, వాట్సప్ గ్రూపుల్లో కవిత బెయిల్ అంశంపై వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: విద్యార్థులకు అలెర్ట్.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!

Advertisment
తాజా కథనాలు