Crispy Nizami Fish Fry: చలికాలంలో సూపర్ స్టార్టర్స్...క్రిస్పీ నిజామీ ఫిష్ ఫ్రై...నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..!!

ఎప్పుడూ చేసే విధంగా కాకుండా క్రిస్పీగా ఫిష్ ఫ్రై తినాలనుకునేవారు ఈ రెసిపీని ఓసారి ట్రై చేయండి.

New Update
Crispy Nizami Fish Fry:  చలికాలంలో సూపర్ స్టార్టర్స్...క్రిస్పీ నిజామీ ఫిష్ ఫ్రై...నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..!!

కావాల్సిన పదార్థాలు:
గోల్డ్ ఫిష్
వెల్లుల్లిపాయలు
అల్లం ముక్క
పచ్చిమిర్చి
కరివేపాకు
చేప మసాలా( మార్కెట్లో దొరుకుతుంది)
పుదీనా
కొత్తిమీర
కారం,
మిరియాలు
జీలకర్ర
ఉప్పు - రుచికిసరిపడా

publive-image

తయారీ విధానం:
ముందుగా గోల్డ్ ఫిష్ నుతీసుకుని శుభ్రంగా కడగాలి. తర్వాత మిక్సీ జార్ వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, చేప మసాలా, పుదీనా, కొత్తిమీర, కారం, మిరియాలు, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో మొక్క జొన్న పిండి ( కార్న్ ఫ్లోర్) నిమ్మరసం కలపాలి.

publive-image

ముందుగా శుభ్రం చేసుకున్న చేపలపై ఈ మసాలను అప్లై చేసి 15నిమిషాలు నానపెట్టండి. చేపలు మసాలతో నానపెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్రై కాకుండా మామూలుగా పెనం మీద చేపలను వేయించాలి. నూనె వేసుకుంటూ నాన్ స్టిక్ పాన్ పై రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అంతే సింపుల్ నిజామీ ఫిష్ ఫ్రై రెడీ. దానిపై ఉల్లిపాయను కట్ చేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది.

publive-image

ఈ నిజామీ ఫిష్ ఫ్రైని వేడివేడిగా సైడ్ డిష్ గా తింటే మామూలు మజా ఉండదు. సాంబార్ భోజనానికి మరింత రుచిగా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి.

ఇది కూడా చదవండి:  బ్రాందీ తాగితే జలుబు..దగ్గు ఫసక్…ఏంటీ బ్రో ఇది నిజమేనా.. ?

Advertisment
తాజా కథనాలు