Jailer Block Buster: సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth )తాజా చిత్రం జైలర్. నెల్సన్(Nelson ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనేక రికార్డులను బద్దలుకొట్టి సిసలైన బ్లాక్‌బస్టర్‌గా అవతరించింది. అందరూ ఊహించని విధంగా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్.. ఇలా ప్రతి రీజియన్ లో అద్భుతమైన వసూళ్లు సాధించి ట్రేడ్ ను ఆశ్చర్యపరిచింది.
వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ లో జైలర్ చిత్రం (అన్ని భాషలను కలిపి) టాప్-2 స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా 25 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ పాతిక రోజుల్లో జైలర్ సినిమాకు వరల్డ్ వైడ్ 618 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. మరో వారం ఈ సినిమా గట్టిగా ఆడే అవకాశం ఉంది.
ఇక వసూళ్ల విషయానికొస్తే.. జైలర్ సినిమా తమిళ వెర్షన్ కు వరల్డ్ వైడ్, 25 రోజుల్లో 194 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అక్షరాలా 85 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సునీల్ తో కలిసి దిల్ రాజు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అటు కేరళలో 57 కోట్లు, కర్నాటకలో 70 కోట్లు, ఓవర్సీస్ లో 196 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది జైలర్. రెస్టాఫ్ ఇండియాలో ఈ సినిమాకు 16 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇలా జైలర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 618 కోట్ల 25 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది.
ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది జైలర్. రిటైర్డ్ జైలర్ అయిన టైగర్ ముత్తువేల్ పాండియన్ అనే క్యారెక్టర్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. రమ్య కృష్ణ, తమన్నా, వినాయకన్, వసంత్ రవి, యోగి బాబు ముఖ్యపాత్రలు పోషించారు. మలయాళ దిగ్గజం మోహన్‌లాల్, కన్నడ లెజెండ్ శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్ పోషించారు, సూపర్ స్టార్ రజనీ మాస్ అప్పీల్, అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.