Super Star Mahesh:మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరుకారం. ఈ సినిమా షూట్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చిన ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ను రెడీ చేశారు. మహేష్ పుట్టినరోజుకు పాట విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ పోన్ చేశారు. వినాయకచవితికి విడుదల చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడీ సాంగ్ వినాయక చవితికి కూడా రావట్లేదంట.
సాంగ్ వర్క్ ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్ లోని కోఠిలో జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకుడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి 3 పాటలు ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, సెకెండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కనిపించనుంది.మహేష్ మూవీకి ఇలాంటి అడ్డంకులు కొత్తేం కాదు. ఈ సినిమాను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కానీ, అప్పట్నుంచి ఏదో ఒక అడ్డంకి వెంటాడుతూనే ఉంది. చివరికి ఒక దశలో కథను కూడా పూర్తిగా మార్చేశారు. ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది అనుకున్న టైమ్ లో, ఫస్ట్ షెడ్యూల్ లో తీసిన సన్నివేశాలన్నింటినీ చెత్త బుట్టలో పడేశారు.
ఇక అంతా సెట్ అనుకున్న టైమ్ లో హీరోయిన్ పూజాహెగ్డేను తొలిగించారు. ఆమె స్థానంలో అప్పటివరకు సెకెండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీలను తీసుకున్నారు. శ్రీలీల స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. మళ్లీ ఫ్రెష్ గా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తమన్ ఆధ్వర్యంలో సాంగ్స్ కంపోజ్ చేశారు.
తమన్ కంపోజ్ చేసిన పాటలన్నింటినీ మహేష్ తిరస్కరించినట్టు కథనాలు వచ్చాయి. ఒక దశలో ఏకంగా తమన్ నే తప్పించాల్సిందిగా మహేష్ డిమాండ్ చేసినట్టు ఊహాగానాలొచ్చాయి. మొత్తానికి అన్నింటినీ దాటుకొని ఓ 3 పాటలకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటిలోంచి ఓ పాటను మహేష్ బర్త్ డేకు విడుదల చేయాలనుకున్నారు. కానీ సాధ్యంకాలేదు. వినాయక చవితికి అనుకున్నారు. అది కూడా సాధ్యంకాదంటూ ప్రస్తుతం ఫీలర్లు వస్తున్నాయి. గుంటూరుకారం పాటల సందడి ఎప్పుడు షురూ అవుతుందో..!
Also Read: గౌతమిని చంపుతానని బెదిరిస్తున్న తమిళనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి