/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-64-jpg.webp)
SRH : సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ భాగ్యనగరంలో సందడి చేసింది. కొండాపూర్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్(Sarath City Capital Mall) లో ఉన్న ఫ్యాషన్ బ్రాండ్ 'రాన్'(Raan) ను పలువురు స్టార్ క్రికెటర్లు సందర్శించారు. ఈ మేరకు హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్, టి.నటరాజన్ లు అభిమానులతో ముచ్చటించి అలరించారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెబుతూ ఖుషీ చేశారు. అనంతరం క్రికెటర్లు(Cricketers) షాపింగ్ చేశారు.
View this post on Instagram
ఇది కూడా చదవండి: Allari Naresh: ఒకే అమ్మాయిని ప్రేమించిన అల్లరి బ్రదర్స్.. చివరికి ఏమైందంటే!
రాన్ కు అధికారిక భాగస్వామిగా SRH..
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ రాన్ కు అధికారిక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇందులో ఆటగాళ్లంగా తమకు కావాల్సిన దుస్తులు తీసుకున్నారు. అయితే ఈ విషయం గమనించిన క్రికెట్ అభిమానులు ఆటగాళ్లను చూడటానికి పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. దీంతో సిటీ క్యాపిటల్ మాల్ పరిసరప్రాంతమంతా కిక్కిరిపోయింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్క దిద్దారు.
View this post on Instagram