Sunita Kejriwal ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బిభవ్ కుమార్ ఫోటోను షేర్ చేయడం వివాదానికి దారితీసింది. ఆమె పోస్ట్‌పై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పట్లో బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని ఆరోపణలు చేశారు స్వాతి మలివాల్. ఆమె ఆరోపణలపైనే బిభవ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. మలివాల్‌పై దాడి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన ఒక రోజు తర్వాత, సెప్టెంబరు 3న, CM అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ తీహార్ జైలు నుండి విడుదలయ్యారు. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కుమార్ 100 రోజులకు పైగా కస్టడీలో ఉన్నారనే కారణంతో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడులయ్యారు.
పూర్తిగా చదవండి..Sunita Kejriwal: ఆ వివాదంలో చిక్కుకున్న కేజ్రీవాల్ భార్య సునీత
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత వివాదంలో చిక్కుకున్నారు. స్వాతి మలివాల్ కేసులో బెయిలుపై విడుదలైన బిభవ్ కుమార్ ఫోటోను Xలో ఆమె షేర్ చేశారు. దీనిపై స్వాతి మలివాల్ బాధితులను నాశనం చేయడం.. నిందితులకు బెయిల్ ఇప్పించడమే వారి పని అంటూ తీవ్రంగా స్పందించారు.
Translate this News: