Summer Drink : మండే వేడి(Heat), ఎండ(Sun) నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి, ప్రజలు తరచుగా వివిధ రకాల పానీయాలను తీసుకుంటారు. ఈ పానీయాలు వేడి నుంచి ఉపశమనాన్ని అందించడమే కాకుండా శరీరాన్ని చల్లబరుస్తాయి. కడుపుకు మంచివిగా పరిగణించబడతాయి. అలాంటి అద్భుతమైన పానీయాలలో ఒకటి మొహబ్బత్ కా షర్బత్. మొహబ్బత్ కా షర్బత్(Mohabbat Ka Sharbat) అనేది ఢిల్లీలోని ప్రసిద్ధ వేసవి పానీయం. దీనిని పుచ్చకాయ ముక్కలు, గులాబీ రేకులను ఉపయోగించి తయారుచేస్తారు. ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ రుచికరమైన, రిఫ్రెషింగ్ లవ్ సిరప్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము..
మొహబ్బత్ కా షర్బత్ తయారీకి కావలసిన పదార్థాలు
- 2 కప్పులు చల్లని పాలు
- ¼ కప్పు చక్కెర
- 3 టేబుల్ స్పూన్లు రోజ్ సిరప్
- 1 కప్పు పుచ్చకాయ రసం
- 1 కప్పు సన్నగా తరిగిన పుచ్చకాయ ముక్కలు
- 1 కప్పు చల్లని నీరు
- 20-25 ఐస్ క్యూబ్ ముక్కలు
- 10-15 తాజా గులాబీలు రేకులు
మొహబ్బత్ కా షర్బత్ తయారు చేసే విధానం
- ముందుగా ఒక గిన్నెలో పాలు , చక్కెర, రోజ్ సిరప్(Rose Syrup) వేసుకోవాలి. ఆ తర్వాత పాలలో చక్కర పూర్తి కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలి.
- చక్కర పూర్తిగా కరిగిన తర్వాత అందులో పుచ్చకాయ రసం, పుచ్చకాయ ముక్కలు, కూల్ వాటర్ వేసుకోవాలి. మరో సారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
- చివరిగా దీంట్లో ఐస్ క్యూబ్స్, వేసి గులాబీ రేకులతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. అంతే సమ్మర్ స్పెషల్ డ్రింక్ మొహబ్బత్ కా షర్బత్రెడీ. వేసవిలో ఈ చాలా మంచిది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.
Also Read: Vastu Tips: బెడ్ రూమ్ లో ఈ వస్తువులను వెంటనే తీసేయండి..! లేదంటే గొడవలు పెరుగుతాయి..!