Summer Effect: ఎండలు దంచేస్తున్నాయి.. ఒళ్ళు పేలిపోతుందా.. ఇలా చేయండి!

ఎండాకాలంలో చెమట-వేడి కారణంగా చర్మంపై దద్దుర్లు రావడం.. ఒళ్ళు పేలడం సహజంగా జరుగుతుంది. వీటిని నివారించడానికి.. ఉపశమనం పొందడానికి గంధం పొడి, ముల్తానీ మట్టి, వేప వంటివి బాగా పని చేస్తాయి. వీటిని ఎలా ఉపయోగించాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు  

Summer Effect: ఎండలు దంచేస్తున్నాయి.. ఒళ్ళు పేలిపోతుందా.. ఇలా చేయండి!
New Update

ఏప్రిల్ నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. వేడి విపరీతంగా పెరిగిపోయి.. ఒళ్ళంతా చిటపటలాడటం మొదలైపోయింది. వేడి.. చెమట కారణంగా చర్మంపై దద్దుర్లు మరియు వేడి దద్దుర్లు వేసవిలో(Summer Effect) సర్వసాధారణమైన సమస్య. ఇది పెద్దల నుండి పిల్లల వరకు ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతుంది.  అందుకే వేసవి ప్రారంభమైన వెంటనే, మనకు వేడి దద్దుర్లు నివారించడానికి ఉపయోగపడే ప్రోడక్ట్స్ అంటూ వచ్చే ప్రకటనలు విపరీతంగా కనిపిస్తాయి. ఈ ప్రకటనల్లో తమ ప్రోడక్ట్ ఒళ్ళు పేలడం వాళ్ళ వచ్చే దద్దుర్లను తొలగిస్తుంది.. చర్మాన్ని రిఫ్రెష్‌గా మారుస్తుంది అంటూ కనిపిస్తుంది. అయితే.. ఆ ప్రోడక్ట్స్ కంటే కూడా తక్కువ ఖర్చుతో మనం కొన్ని సహజపద్ధతుల ద్వారా చర్మంపై వేడి వలన వచ్చే అనేక సమాస్యలను దూరం పెట్టవచ్చు. వేసవిలో అధిక చెమట కారణంగా, చర్మంపై బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది.  ఇది దురద, దద్దుర్లు, వేడి పొక్కులు కలిగిస్తుంది. కాబట్టి ఈ చర్మ సమస్యలను నివారించడానికి.. ఉపశమనం(Summer Effect) పొందడానికి ఇంటి నివారణల చిట్కాలను తెలుసుకుందాం.

గంధపు పొడి-ముల్తానీ మట్టి - ప్రయోజనం..
దద్దుర్లు - వేడి పొక్కులు నివారించడానికి లేదా ఉపశమనం పొందడానికి, ముల్తానీ మిట్టిని అవసరాన్ని బట్టి నీటిలో నానబెట్టండి. ఒకటిన్నర గంటల తర్వాత, నీటిలో నుండి తీసివేసి, ఒక చెంచా చందనం పొడి వేసి మిశ్రమాన్ని బాగా సిద్ధం చేయండి. మీరు ఈ ప్యాక్‌ని మీ మొత్తం శరీరం అలాగే  మీ ముఖం మీద ఉపయోగించవచ్చు. ముల్తానీ మట్టి - చందనం చల్లదనం మీకు రిఫ్రెష్ అనుభూతిని ఇస్తుంది.  వేడి దద్దుర్లు నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ ప్యాక్ స్కిన్ టానింగ్, మొటిమలు, మచ్చలను తగ్గించడం అలాగే చర్మ ఛాయను(Summer Effect) మెరుగుపరచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

Also Read: అయ్యో అనుపమా.. అన్నీ అలాంటివేనా?

వేపతో.. 
వేపలో (Summer Effect)యాంటీ బ్యాక్టీరియల్ - యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. అందుకే చర్మ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, దద్దుర్లు, వేడి పొక్కులు వంటి చర్మ సమస్యలను తొలగించడంలో వేప అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. వేడి దద్దుర్లు నివారించడానికి, మీరు ప్రతిరోజూ వేప నీటితో స్నానం చేయవచ్చు. ఇది కాకుండా, దాని నూనె - ఆకుల పేస్ట్ ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

బేకింగ్ సోడా..
మీరు ప్రిక్లీ హీట్(Summer Effect) అంటే ఒళ్ళు పేలిపోవడం కలిగి ఉంటే, ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకొని నీటిలో కరిగించండి. ఈ నీటిని ప్రిక్లీ హీట్- దద్దుర్లు ఉన్న ప్రదేశాలలో అప్లై చేసి వదిలేయండి. కొంత సమయం తరువాత, సాధారణ నీటితో చర్మాన్ని శుభ్రం చేయండి. ఈ రెమెడీ ఒకటి లేదా రెండు రోజుల్లోనే చాలా ఉపశమనాన్ని అందిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పాఠకుల ప్రాధమిక అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. వివిధ సందర్భాలలో నిపుణులు అందించిన విషయాల ఆధారంగా ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. వీటిని ఆచరించే ముందు మీ వైద్యుల సలహా కూడా తీసుకోవలసిందిగా సూచిస్తున్నాం.

#health #summer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe