Roshan Kanakala: స్టార్ యాంకర్ సుమ కుమారుడి సినిమా ఫస్ట్ లుక్‍ పోస్టర్ లాంచ్..!

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమ దంపతుల కుమారుడు రోషన్ 'బబుల్‍గమ్' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‍ రిలీజ్ చేస్తూ టైటిల్ రివీల్ చేశారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. సోషల్ మీడియా ద్వారా ఈ ఫస్ట్ లుక్‍ పోస్టర్ లాంచ్ రిలీజ్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చుసిన నెటిజన్లు సుమ కనకాల కుమారుడికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

New Update
Roshan Kanakala: స్టార్ యాంకర్ సుమ కుమారుడి సినిమా ఫస్ట్ లుక్‍ పోస్టర్ లాంచ్..!

Roshan Kanakala Bubblegum First Look: ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల (Rajiv Kanakala), స్టార్ యాంకర్ సుమ(Anchor Suma) దంపతుల కుమారుడు రోషన్ కనకాల (Roshan Kanakala) 'బబుల్‍గమ్' (Bubblegum)మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి (Rajamouli) ఈ సినిమా ఫస్ట్ లుక్‍ టైటిల్ ను విడుదల చేశారు. రోషన్ కు ఆల్ ది బెస్ట్ తెలుపుతూ రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చుసిన నెటిజన్లు సుమ కనకాల కుమారుడికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

'బబుల్‍గమ్'  మూవీతో యూత్ ఆడియన్స్ టార్గెట్ గా బ్యూటిఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రోషన్. క్షణం, కృష్ణ అండ్ లీల చిత్రాల ఫేమ్ డైరెక్టర్ రవికాంత్ పారెపు దర్శకత్వంలో 'బబుల్‍గమ్'  అనే సినిమాతో ఆయన సినీ ఎంట్రీ ఉండబోతోంది. ఈ చిత్రం ద్వారా మానస చౌదరి హీరోయిన్‍గా పరిచయం అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‍ రిలీజ్ చేస్తూ టైటిల్ రివీల్ చేశారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. సోషల్ మీడియా ద్వారా ఈ ఫస్ట్ లుక్‍ పోస్టర్ లాంచ్ రిలీజ్ చేశారు.

ఈ మేరకు "నటుడిగా డెబ్యూ మూవీ చేస్తున్న రోషన్‍కు అభినందనలు. నీ సొంత ముద్రను వేస్తూనే.. రాజీవ్, సుమ గర్వపడేలా చేయాలని ఆశిస్తున్నా. బబుల్‍గమ్ యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్" అని తెలుపుతూ రాజమౌళి ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చుసిన నెటిజన్లు సుమ కనకాల కుమారుడికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. బబుల్‍గమ్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్‍గా, రొమాంటిక్‍గా ఉంది. హీరోయిన్‍ మానసను రోహన్ కౌగిలించుకోగా.. నోట్లో బబుల్‍గమ్ ఊదారు. ఈ ఫస్ట్ పోస్టర్‌లో ఇద్దరి లుక్ ట్రెండీగా ఉంది. దీంతో 'బబుల్‍గమ్' ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోందని, ఈ సినిమా యూత్ మెచ్చే మూవీ అవుతుందని అంటున్నారు నెటిజన్లు.

Also Read: తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్మెంట్..అమర్, సందీప్ కు నాగార్జున క్లాస్..!

Advertisment
తాజా కథనాలు