Suhas Movie: 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' రిలీజ్ డేట్ వచ్చేసింది

కలర్ ఫొటో సుహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'. దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం అఫిషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. 2024 ఫిబ్రవరి 2 న థియేటర్స్ విడుదల కానున్నట్లు తెలిపింది.

Suhas Movie: 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' రిలీజ్ డేట్ వచ్చేసింది
New Update

Suhas Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా కొత్త నటులు, డైరెక్టర్స్ భిన్నమైన కథలతో తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇదే తరహాలో ఎంట్రీ ఇచ్చారు హీరో సుహాస్. చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానెల్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో సపోర్టింగ్ రోలో నటించాడు. సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కలర్ ఫొటో' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో సుహాస్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో సహాయనటుడిగా పలు పాత్రల్లో కనిపించాడు.

ప్రస్తుతం సుహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'. ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, మహాయాన మోషన్ పిక్చర్స్, GA2 పిక్చర్స్, బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దుష్యంత్ కటికనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సుహాస్ మల్లి పాత్రలో కనిపించనున్నారు. శివాని నాగారం కథానాయికగా నటించింది. కామెడీ డ్రామా కథనంతో ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవలే సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మల్లిగాడి చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. తాజాగా చిత్ర బృందం 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించింది.

publive-image

ఈ చిత్రం వచ్చే ఏడాది 2024 ఫిబ్రవరి 2 న థియేటర్స్ విడుదల కానుంది. శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ, జగదీశ్ ప్రతాప్ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాజిద్ బేగ్, శేఖర్ చంద్ర సంగీతం అందించారు. కలర్ ఫోటో చిత్రం హీరోగా సుహాస్ కు కెరీర్ లో మంచి బ్రేక్ అందించింది

Also Read:  Salman Khan: బాలీవుడ్ భాయ్‌జాన్‌ సల్లూ భాయ్.. బర్త్ డే స్పెషల్

#ambajipeta-marriage-band #ambajipeta-marriage-band-release-date
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe