Low BP: ఒక్కసారిగా బీపీ తగ్గితే ఏం చేయాలి?.. ఈ చిట్కాలు ఫాలో అవండి

శరీరంలో నీరు లేనప్పుడు బీపీ మరింత పడిపోతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ BP ఉన్న సందర్భంలో వేడి నీటి స్నానానికి దూరం ఉండాలి. రక్తపోటు తగ్గినప్పుడు ఉప్పు తినాలి.

New Update
Low BP: ఒక్కసారిగా బీపీ తగ్గితే ఏం చేయాలి?.. ఈ చిట్కాలు ఫాలో అవండి

 Low BP: సాధారణ రక్తపోటును నిర్వహించడం ఒక సవాల్‌తో కూడుకున్న పని. మనలో కొందరికి బీపీ ఎక్కువ, మరికొందరికి తక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారు బీపీని అదుపు చేసేందుకు రోజూ మాత్రలు వేసుకుంటారు. కానీ బీపీ తక్కువగా ఉన్నవారు ఉప్పు లేదా పచ్చళ్లు తింటే సరిపోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది. రక్తపోటు తగ్గినప్పుడు ఉప్పు ఎక్కువగా తీసుకోవడం నిజంగా శరీరానికి మంచిదేనా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. మద్యం సేవించే వారిలో బీపీ పెరుగుతుందని విన్నాం. ఎందుకంటే అతిగా తాగడం వల్ల మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. శరీరంలో నీరు లేనప్పుడు బీపీ మరింత పడిపోతుంది. కాబట్టి ఎక్కువ నీరు తాగడం వల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.

ఉప్పు తీసుకోవడం తగ్గించండి:

  • అధిక రక్తపోటు ఉన్నప్పుడు ఉప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఎందుకంటే ఉప్పులో ఉండే సోడియం రక్తపోటును మరింత పెంచుతుంది. రక్తపోటు తగ్గినప్పుడు మీరు ఉప్పు తినాలని దీని అర్థం కాదు. ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మన శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి.

బీపీ తక్కువైతే ఏం చేయాలి?

  • రక్తపోటు తక్కువగా ఉన్నప్పుడు కళ్లు తిరగడం, చూపు మందగించడం సాధారణం. కాబట్టి అలాంటి సమయంలో హఠాత్తుగా లేవడం లేదా ఏదైనా చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ముందుగా కాళ్లను గట్టిగా పట్టుకుని నిలబడాలి. అప్పటికే మంచం మీద పడుకుని ఉంటే పైకిలేచి కాసేపు కూర్చొని ఆ తర్వాత నిలబడాలి.

తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు తినండి:

  • రక్తపోటు తక్కువగా ఉన్నప్పుడు అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలు తీసుకోవడం మంచిది కాదు. కార్బోహైడ్రేట్ ఆహారాలు మధుమేహంతో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి అవి నేరుగా గుండెకు హాని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు.

వేడి స్నానం చేయవద్దు:

  • తక్కువ BP ఉన్న సందర్భంలో వేడి నీటి స్నానం చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే దీని వల్ల తల ఇంకా తిరుగుతుంది. స్నానం చేయాలనుకుంటే స్టూల్ మీద కూర్చుని కాసేపు రిలాక్స్ అయ్యి గోరువెచ్చని నీళ్లలో స్నానం చేయాలి.

కొద్ది కొద్దిగా ఆహారం తినండి:

  • తక్కువ రక్తపోటు ఉన్నవారు ఒకేసారి అతిగా భోజనం చేయకూడదు. అలా కాకుండా ప్రతి రెండు గంటలకొకసారి తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే శరీరంలో అలసట తగ్గి, తలతిరగడం పోయి, రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది.

ఇది కూడా చదవండి: షుగర్‌ను కంట్రోల్‌ చేసే సూపర్‌ డ్రింక్స్‌..ఇంట్లోనే సులభంగా తయారీ

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు