పురుషుడిలా మారనున్న మాజీ ముఖ్యమంత్రి కుమార్తె..ఎందుకో తెలుసా.?

బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య లింగమార్పిడి శస్త్రచికిత్స(SRS)చేయించుకోనున్నట్లు ప్రకటించారు. ఇటీవల వర్క్‌షాప్‌కు హాజరైన సుచేతన, శస్త్రచికిత్సకు వెళ్లే ముందు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. లింగమార్పిడి వల్ల మానసికంగానే కాకుండా శారీరకంగా పురుషుడిలానే ఉండాలని తాను కోరకుంటున్నట్లు తెలిపారు. LGBTQఉద్యమంలో భాగంగానే తాను పురుషుడిగా మారుతున్నట్లు సుచేతన వెల్లడించారు.

New Update
పురుషుడిలా మారనున్న మాజీ ముఖ్యమంత్రి కుమార్తె..ఎందుకో తెలుసా.?

సుచేతన భట్టాచార్య...బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె. ఆమె వయస్సు 41ఏళ్లు. పుట్టుకతో మహిళనే అయినప్పటికీ....చిన్ననాటి నుంచి మానసికంగా పురుషుడిలానే జీవిస్తోంది. మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా తాను పురుషుడిలా మారాలని డిసైడ్ అయ్యింది. ఈమధ్య నిర్వహించిన ఓ LGBTQవర్క్ షాప్ కు హాజరైన సుచేతన ఈ విషయంపై తనకు పూర్తి అవగాహన వచ్చిందని తెలిపారు. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇదే విషయంపై న్యాయ నిపుణులతోపాటుగా వైద్యుల సలహాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తాను పురుషుడిగా మారిన తర్వాత తన పేరును సచేతన భట్టాచార్య నుంచి సుచేతన్ భట్టాచార్యగా మార్చుకుంటున్నట్లు పేర్కొన్నారు.

CM's daughter who will become a man

తన జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాల వలే మహిళ నుంచి పురుషుడిలా మారాలని తానే స్వయం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ట్రాన్స్ మ్యాన్ గా తాను ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను తట్టుకునేందుకు లింగమార్పిడి ఆపరేషన్ ఉపయోగపడుతుందన్నారు. అయితే తాను ఇప్పటికే పురుషుడిగా భావిస్తున్నట్లు చెప్పారు. తన ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఎవరూ ఎలాంటి వివాదం చేయకూడదని..రాద్ధాంతం చేయరాదని విజ్ఞప్తి చేశారు. తన నిర్ణయం వల్ల తన కుటుంబానికి కానీ, తన తల్లిదండ్రులకు ఎలాంటి సమస్య లేదన్నారు. ఈ విషయంలో తన తల్లిదండ్రులను లాగకూడదని మీడియాకు సూచించారు సుచేతన.

Advertisment
తాజా కథనాలు