TG Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. 2-3 రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు! TG: రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి తుమ్మల. ఆయిల్‌పామ్, అంతర పంటల రాయితీ డబ్బులను 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. దీంతో పాటు సూక్ష్మ సేద్య కంపెనీలకు సైతం రూ.55.36 కోట్ల బకాయిలను విడుదల చేస్తామన్నారు. By V.J Reddy 19 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TG Farmers Subsidy Money: తెలంగాణ ప్రభుత్వం పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా, ఆయిల్ పామ్ సాగు, వివిధ ఉద్యాన పంటలలో సూక్ష్మ సేద్యం రాయితీలు ఇస్తూ, 2024-25 లో బకాయిలు విడుదల చేసింది. ఈ క్రమంలో రైతులను ప్రొత్సహించవలసిందిగా ఉద్యాన శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఆదేశించారు. 2023-24 గాను ఆయిల్ పామ్ సాగు పధకం కింద, కేంద్ర ప్రభుత్వం రూ.80.10 కోట్లను విడుదల చేయగా, రూ.53.40 కోట్ల రాష్ట్ర వాటా కలుపుకుని మొత్తం రూ.133.50 కోట్లు విడుదల చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం రూ.100.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆయిల్ పామ్ తోటల నిర్వహణ, అంతర పంటల సాగుకు సంబంధించిన రాయితీలను, 2-3 రోజులలో రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ఉద్యానశాఖ చర్యలు తీసుకోవడంతో పాటు, 2022-23 సంవత్సరానికి గాను విడుదల కావల్సి ఉన్న రూ. 55.36 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. Also Read: ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ! #thummala-nageswara-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి