Nellore: మా సమస్యలను తీర్చండి.. ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ఆందోళన..!

మా సమస్యలను తీర్చండి అంటూ నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత, నాన్ టీచింగ్ సిబ్బంది కొరత ఉందని వాపోతున్నారు.

Nellore: మా సమస్యలను తీర్చండి.. ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ఆందోళన..!
New Update

Nellore: నెల్లూరు జిల్లా రాపూరు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో 1984లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మించారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల గ్రామాలలో వేలాది మంది విద్యార్థి, విద్యార్థినిలు ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నారు.

అయితే, ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాల కొరత వలన విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రహరీ గోడ, త్రాగునీరు సమస్య, ఉపాధ్యాయుల కొరత, నాన్ టీచింగ్ సిబ్బంది కొరత ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తల్లిదండ్రులు ఈ కళాశాల నందు విద్యను అభ్యసించడానికి నిరాకరిస్తున్నారన్నారు.

కళాశాల విద్యార్థిని, విద్యార్థులు RTVతో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఉన్నత విద్య శాఖ అధికారులు తమ సమస్యలు పరిష్కారించాలని వేడుకున్నారు.

#nellore
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి