Chandraya-3 : ఓ వైపు చంద్రుడిపై ఆరాటం..మరోవైపు విషసర్పాలతో పోరాటం..!!

నేడు మనం టెక్నాలజీలో రాకెట్ కంటే వేగంతో దూసుకుపోతున్నాం. భారత్ చంద్రుడిపై అడుగులు వేసిందని...సంబురాలు చేసుకుంటున్నాం. కానీ మహారాష్ట్రలోని ఓ గ్రామంలోని పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే ప్రతిరోజూ నాసిరకం థర్మాకోల్ షీట్లపై, నీటిలో విషసర్పాలతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సిందే. చంద్రుడిని ముద్దాడమన్న సంతోషం ఓవైపు...విషసర్పాలతో చిన్నారులు పడుతున్న పాట్లు మరోవైపు. టెక్నాలజీలో మనం ఎంత స్పీడుగా దూసుకెళ్లినా...కూగ్రామాల పరిస్థితి ఎలా ఉందో చెప్పాడని ఛత్రపతి సంభాజీ నగర్ నుంచి 40కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం నిదర్శనం.

New Update
Chandraya-3 : ఓ వైపు చంద్రుడిపై ఆరాటం..మరోవైపు విషసర్పాలతో పోరాటం..!!

Chandraya-3 : బడికి వెళ్లి చదువుకోవాలన్న ఆ చిన్నారుల ఉత్సాహం...భయంకరమైన సర్పాలను సైతం లెక్కచేయడం లేదు. ప్రతిరోజూ థర్మాకోల్ షీట్ మీద నది దాటుతున్నారు. ప్రజక్తా కాలే. ఆమె వయస్సు 11ఏళ్లు. మహారాష్ట్రలోని అతిపెద్ద డ్యాములలో ఒకటైన జలాశయం మీదుగా ప్రతిరోజూ తన సహవిద్యార్థులు 15మందితో కలిసి పాఠశాలకు వెళ్తోంది. నదిని దాటాలంటే నాసిరకంగా తెప్పలపై వెళ్లాల్సిందే. నది మధ్యలో భయంకరమైన విషసర్పాలను సైతం దాటుకోవల్సిందే.

ఔరంగాబాద్ జిల్లాలోని భీవ్ ధనోరా గ్రామానికి చెందిన ప్రజక్తా ప్రతిరోజూ కిలోమీటరు మేర ఉన్న జయక్వాడి డ్యామ్ బ్యాక్ వాటర్ ను దాటడానికి నాసిరకం థర్మాకోల్ షీట్ పై కూర్చుని తెడ్డుల సహయంతో ధైర్యంగా ప్రయాణం చేస్తున్నారు. ప్రతిరోజూ 25కిలోమీటర్ల మేర ప్రయాణించి పాఠశాలకు చేరుకుంటున్నారు.  కానీ వారి తల్లిదండ్రులు చంద్రునిపై అడుగుపెట్టిన చంద్రయాన్ 3ని చూసి ఆశ్చర్యపోతున్నారు. దేశం చంద్రునిపై అడుగుపెడితే...తాము నదిపై అడుగుపెట్టేందుకు వంతెన కావాలని వేడుకున్నా తమ ఘోసను ఏ అధికారి పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

ఇది కూడా చదవండి: భారతదేశం ప్రపంచానికి మార్గాన్ని చూపుతోంది: మోదీ

తమ పిల్లలకు నదిని ఎలా దాటాలో నేర్పించారు. ప్రజక్తా తన తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్న శిక్షణతో తనతో పాటు 15 మంది స్నేహితులను ప్రతిరోజూ పాఠశాలకు తీసుకెళ్తుంది. రిజర్వాయర్ దాటుతున్నప్పుడు విషసర్పాలు..థర్మాకోల్ షీట్ పైకి ఎక్కకుండా ఉండేందుకు వెదురు కర్రలను తమతోపాటు తీసుకెళ్తామని ప్రజక్తా చెబుతోంది. ఆనకట్ట బ్యాక్ వాటర్ రెండు గ్రామాలను విడదీసింది. ఆనకట్టి దాదాపు 47ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయినా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని వాపోతోంది.

మా పిల్లలు మాలాగే నిరక్షరాస్యులగా ఉండకూడదు. నా కుమార్తె, కొడుకు పాఠశాలకు వెళ్లేందుకు థర్మాకోల్ షీట్లను ఉపయోగిస్తున్నారు. నదిలో విషపూరితమైన పాములు ఉన్నా ఏమాత్రం భయపడకుండా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని ప్రజక్తా తండ్రి విష్ణు కాలే తెలిపారు. విద్యార్థుల ప్రమాదకర ప్రయాణాన్ని ప్రిన్సిపాల్ రాజేంద్ర ఖేమ్నార్ ధృవీకరించారు. ప్రిన్సపల్ మాట్లాడుతూ..నేను కొన్ని నెలలుగా ఇక్కడి పాఠశాలలో పనిచేస్తున్నాను. ప్రమాదకరమైన నదిని దాటుకుంటూ పాఠశాలకు వస్తున్నారన్న విషయం నా తోటి ఉపాధ్యాయులు చెబితే విన్నాను అని ఖేమ్నార్ అన్నారు. ఛత్రపతి సంభాజీనగర్ నుండి 40 కి.మీ దూరంలో ఉన్న ఈ గ్రామం ఔరంగాబాద్-పూణే హైవే నుండి దాదాపు 5 కి.మీ. ఈ గ్రామం మూడు వైపులా జయక్వాడి ఆనకట్ట, శివనా నది యొక్క బ్యాక్ వాటర్స్ తో నిండి ఉంటుంది.

ఇది కూడా చదవండి:  డ్రగ్స్‌ కేసులో ఎస్సై అరెస్ట్.. ఇంట్లోనే దందా

ఈ నదిపై వంతెన లేకపోవడంతో గ్రామస్తులకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. విద్యార్థులు బ్యాక్ వాటర్ దాటకపోతే 25 కి.మీ మేర బురద నేల మీదుగా నడవాల్సి వస్తోంది. లాహుకిపై వంతెన కావాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామ సర్పంచ్ సవితా చవాన్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన రాలేదని వాపోతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు