నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. పీయూసీ విద్యార్థిని దీపిక ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని వాష్ రూమ్ కెళ్లి చాలాసేపు తిరిగి రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూశారు భద్రతా సిబ్బంది. చున్నీతో బాత్రూమ్ లో ఉరివేసుకుని కనిపించింది.
అపస్మారక స్థితిలో పడి ఉన్న దీపికను బైంసా ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్దారించారు వైద్యులు విద్యార్థిని ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం చెబుతోంది.
అధికారుల వివరణ
వడ్ల దీపిక ఆర్జీయూకేటీ బాసరలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈమెది సంగారెడ్డి జిల్లా గొర్రెకల్. వార్షిక పరీక్షల అనంతరం బాత్రూం కి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి భద్రతా సిబ్బంది చూసేసరికి చున్నీతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించారు. తర్వాత భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు దీపిక మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విద్యార్థిని దీపిక మృతి పట్ల ఆర్జీయూకేటీ బాసర అధికారులు, సిబ్బంది తదితరుల తరఫున చింతిస్తున్నాం.