Hyderabad:పార్కుల్లో రాసలీలపై షీ టీమ్స్ స్పెషల్ ఫోకస్.. అదుపులో 12 జంటలు పార్కులు, పబ్లిక్ ప్లేస్ ల్లో రాసలీలకు పాల్పడే వారిపై షీ టీమ్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. శుక్రవారం నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ లో 12 జంటలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. 24 గంటలు షీ టీమ్స్ నిఘా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. By srinivas 24 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి She Teams: రహస్య ప్రేమికులు, వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారికి హైదరాబాద్ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పట్టపగలే పార్కులు, తదితర పబ్లిక్ ప్లేస్ ల్లో రాసలీలకు పాల్పడే వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తమ అసభ్యకర చేష్టలతో జనాలను ఇబ్బందులకు గురిచేసేవారిపై షీ టీమ్స్ కన్నేసి ఉంచబోతున్నట్లు హెచ్చరించారు. 12 జంటలకు వార్నింగ్.. ఈ మేరకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న పార్కుల్లో అసాంఘిక కార్యకాలాపాలకు పాల్పడుతున్న పలువురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, నెక్లెస్‌రోడ్, ఇందిరా పార్క్‌లో గత వారంగా తనీఖీలు చేపడతున్నారు. ఈ క్రమంలోనే యూసఫ్ గూడా కృష్ణకాంత్ పార్క్‌తో పాటు పబ్లిక్ ప్లేస్‌లలో రాసలీలలకు పాల్పడుతూ.. అసభ్యంగా ప్రవర్తించిన 12 జంటలను షీ టీమ్స్ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి :Gujarath: చేపల పడవలో రూ.350 కోట్ల హెరాయిన్ పట్టివేత.. అదుపులో ముగ్గురు మహిళలు! అలాగే మరికొందరికి మరోసారి ఇలాంటి పనులు చేయకుండా ఫైన్ వేసి పంపించినట్లు వెల్లడించారు. బహిరంగా ప్రదేశాల్లో ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, 24 గంటలు షీ టీమ్స్ నిఘా ఉంటుందని పోలీసు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. #strict-action #parks-and-public-places-hyderabad #sexual-discussions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి