AP: పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి.! చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ఎంపీ రెడప్ప ఇంటికి వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడికి యత్నించారు. దాడిలో 15 కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. కార్యకర్తలు రాళ్ల దాడి ఆపకపోవడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. By Jyoshna Sappogula 18 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి MP Mithun Reddy: చిత్తూరు జిల్లా పుంగనూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పుంగనూరులోని మాజీ ఎంపీ రెడప్ప ఇంటికి వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు రాళ్ల దాడికి యత్నించారు. రాళ్ల దాడిలో 15 కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో వైసీపీ, టీడీపీ ఇరువర్గాలు రాళ్లు, కుర్చీలతో దాడి చేసుకున్నారు. Also Read: సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్ రెడ్డప్ప ఇంటికి చుట్టుముట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎంత అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. దీంతో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. మరోవైపు ఆత్మరక్షణలో భాగంగా గన్‌మెన్ సైతం కాల్పులు చేశారు. 3 రౌండ్‌లు గాల్లోకి కాల్పులు జరిపారు మిథున్ రెడ్డి గన్‌మెన్. ఈ దాడిలో పోలీసులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై రెడ్డప్ప స్పందిస్తూ.. ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యయత్నం జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ పాలనలో దాడులు ఎక్కువ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. #mp-mithun-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి