Stock Market Review: గతవారంలో నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఈ వారం పుంజుకుంటుందా? నిపుణులు చెప్పేది ఇదే!

గత వారం స్టాక్ మార్కెట్ నష్టాలను చూసింది. ముఖ్యంగా వారం చివరి రోజు శుక్రవారం ఇండెక్స్ లు క్రింది చూపు చూశాయి. మరి ఈవారం మార్కెట్ ఎలా ఉండవచ్చు. నిపుణుల అంచనా ప్రకారం ఈవారం మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది. మార్కెట్ ను ప్రభావితం చేసే అంశాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు

New Update
Disaster Recovery : సెలవు రోజు అయినా ఆరోజు స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది.. ఎందుకంటే.. 

Stock Market Review: గత వారాంతంలో శుక్రవారం అంటే ఆగస్టు 2న స్టాక్ మార్కెట్ కింది చూపులు చూసింది. ఆ వారం మొత్తంగా చూసుకుంటే గత వారంలో సెన్సెక్స్‌లో 0.76 శాతం క్షీణత నమోదైంది . నిఫ్టీ కూడా 0.80 శాతం క్షీణించింది.  దీంతో ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు అనే అంశంలో అందరూ ఉత్కంఠతో ఉన్నారు. ఇన్వెస్టర్స్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఈ వారం కోలుకుంటుందా? శుక్రవారం నాటి తీరే కొనసాగుతుందా? అనే టెన్షన్ లో ఉన్నారు. అయితే, నిపుణుల అంచనా ప్రకారం.. ఈ వారం స్టాక్ మార్కెట్ లో పెరుగుదల ఉండవచ్చు. కంపెనీల మొదటి త్రైమాసిక (Q1FY25) ఫలితాలు, RBI ద్రవ్య విధాన కమిటీ సమావేశం, దేశీయ ఆర్థిక డేటా, గ్లోబల్ ఎకనామిక్ డేటా, FII-DII ప్రవాహాలు అలాగే రాబోయే IPOపై మార్కెట్ గమనం ఆధార పడి ఉంటుంది. వీటిలో చాలా అంశాలు మన స్టాక్ మార్కెట్ కు పాజిటివ్ గానే ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

ఈ వారం మార్కెట్ కదలికను నిర్ణయించే ఈ అంశాల గురించి నిపుణులు చెప్పిన విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. 

  1. ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం
    Stock Market Review: ఈరోజు అంటే మంగళవారం (ఆగస్టు 6) మొదలై ఆగస్టు 8న ముగియనున్న ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశంపైనే మార్కెట్‌లోని ఇన్వెస్టర్లందరి దృష్టి ఉంటుంది. నిపుణులు రెపో రేటు 6.5% వద్ద యథాతథంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలోని నిపుణులు సెప్టెంబర్‌లో ఫెడ్ ఫండ్స్ రేటులో కోత పెట్టవచ్చని భావిస్తున్నారు.
  2. కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు:
    Stock Market Review: ఈ వారం 900కు పైగా కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు రానున్నాయి. ఇందులో నిఫ్టీ-50కి చెందిన భారతి ఎయిర్‌టెల్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ అంటే ONGC, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పేర్లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా, శ్రీ సిమెంట్, టాటా పవర్, ఎల్‌ఐసి, ఆయిల్ ఇండియా, వేదాంత, టివిఎస్ మోటార్, టాటా కెమికల్స్ - ఎన్‌హెచ్‌పిసి వంటి కంపెనీలు కూడా తమ ఆర్థిక సంవత్సరం 2024-25 ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి.
  1. డొమెస్టిక్ ఎకనామిక్ డేటా
    ఎకనామిక్ డేటా గురించి చూసినట్లయితే, ఆగస్టు 5న విడుదల కానున్న జూలైకి సంబంధించిన HSBC సర్వీసెస్ PMI డేటాపై మార్కెట్ దృష్టి ఉంటుంది.  ప్రాథమిక అంచనాల ప్రకారం, జూలైలో సర్వీస్ సెక్టార్  PMI 61.1కి పెరిగింది (మార్చి తర్వాత ఇది అత్యధిక వృద్ధి), అంతకుముందు నెలలో ఇది 60.5గా ఉంది. అంతేకాకుండా, జూలై 26 (15 రోజుల వ్యవధి)తో ముగిసే పక్షం రోజులకు సంబంధించి బ్యాంక్ లోన్ - డిపాజిట్ వృద్ధి డేటా ఆగస్టు 9న విడుదల అవుతుంది. ఇది కాకుండా, ఆగస్టు 2తో ముగిసే వారానికి సంబంధించిన విదేశీ మారకద్రవ్య నిల్వల డేటా కూడా ఆగస్టు 9న విడుదల కానుంది.
  2. గ్లోబల్ ఎకనామిక్ డేటా
    Stock Market Review: గ్లోబల్ ఎకనామిక్ డేటా విషయానికి వస్తే,  మార్కెట్ ఇన్వెస్టర్లు ఈ వారం ప్రధాన దేశాల సేవల PMI డేటాపై ఒక కన్నేసి ఉంచుతారు. ఇది కాకుండా, అమెరికా వారపు ఉద్యోగాల డేటా, చైనా ద్రవ్యోల్బణంతో పాటు జూలైలో PPI డేటాపై కూడా దృష్టి పెడుతుంది. 
  3. FII-DII ఫ్లో
    విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) - దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DII) కార్యకలాపాలు ఎలా ఉంటాయనేది చూడాలి.  భారతీయ ఈక్విటీలలో ఎఫ్‌ఐఐ పెట్టుబడులు అస్థిరంగా ఉండగా, దేశీయ పెట్టుబడిదారులు స్థిరమైన కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. ఆగస్టు 2తో ముగిసిన వారానికి నగదు విభాగంలో ఎఫ్‌ఐఐలు రూ.12,756 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే, డీఐఐలు రూ.17,226 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఎఫ్‌ఐఐల ఉపసంహరణను పూర్తిగా భర్తీ చేశాయి. ఈవారం కూడా అదే ట్రెండ్ కొనసాగే అవకాశం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
  1. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ)
    Stock Market Review: ఈ వారం ప్రైమరీ మార్కెట్‌లో చాలా అవకాశాలు ఉన్నాయి. మెయిన్‌బోర్డ్ విభాగంలో, యూనికామర్స్ ఇ-సొల్యూషన్స్ లిమిటెడ్, ఫస్ట్‌క్రై మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ IPO ఆగస్టు 6న ఓపెన్ అవుతుంది.  సీగల్ ఇండియా IPO ఆగస్టు 5న ముగుస్తుంది. Ola ఎలక్ట్రిక్ మొబిలిటీ IPO ఆగస్టు 6న ముగుస్తుంది. SME విభాగంలో, ఈస్తటిక్ ఇంజనీర్స్ తన IPO ఆగస్టు 8న ప్రారంభించనుంది. ధరివాల్‌కార్ప్ IPO ఆగస్టు 5న ముగుస్తుంది. Fcom హోల్డింగ్స్ - పిక్చర్ పోస్ట్ స్టూడియోస్ IPO ఆగస్టు 6న ముగుస్తుంది.

ఇక ఒకసారి గతవారాంతంలో మార్కెట్ ఎలా ముగిసిందో ఒకసారి చూద్దాం. గత శుక్రవారం సెన్సెక్స్ 885 పాయింట్ల పతనంతో 80,981 వద్ద ముగిసింది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 293 పాయింట్లు క్షీణించి, 24,717 స్థాయి వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 25 క్షీణించగా, 5 మాత్రమే పెరిగాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 42 క్షీణించగా, 8 లాభాలు చూశాయి. 

Advertisment
తాజా కథనాలు