Stock Market Report: ఫెడ్ రేట్లు స్థిరంగా ఉంచారు..ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు?

యూఎస్ ఫెడ్ రేట్ల ప్రకటన వచ్చింది. US ఫెడరల్ రిజర్వ్  2024 కోసం తన రెండవ వడ్డీ రేటును స్థిరంగా ఉంచింది. ప్రపంచ మార్కెట్లు పాజిటివ్ ధోరణిలో ఉన్ననేపథ్యంలో మన స్టాక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు? నిపుణుల అంచనాలు ఏమిటి? స్టాక్ మార్కెట్ ఎనాలిసిస్ కోసం టైటిల్ పై క్లిక్ చేయండి. 

Stock Market Review: రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఇన్వెస్టర్లకు పండగే!
New Update

Stock Market Report: కొన్ని రోజుల క్రితం యూఎస్ ఫెడ్ రేట్లు తగ్గుతాయనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. రెండు రోజుల క్రితం అమెరికా ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచవచ్చనే అంచనాలు వచ్చాయి. దీంతో మన మార్కెట్లు కుదుపునకు లోనయ్యాయి. మంగళవారం(మార్చి 19) ఒక్కరోజే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చూశాయి. అయితే, నిన్న అంటే మార్చి 20న కాస్త పుంజుకున్నాయి. చాలారోజులుగా అమెరికా ఫెడ్ రేట్ల ప్రకటన నేపధ్యంగానే మన స్టాక్ మార్కెట్లు (Stock Market Report) కదులుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశం తర్వాత US ఫెడరల్ రిజర్వ్ ఈ రోజు 2024 కోసం తన రెండవ వడ్డీ రేటు నిర్ణయాన్ని ప్రకటించింది.  అక్కడ బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను 5.25 శాతం - 5.50 చొప్పున మార్చకుండా ఉంచుతూ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అలాగే, ఫెడ్ విధాన రూపకర్తలు 2025లో తక్కువ రేటు తగ్గింపులను అంచనా వేశారు. 2024కి US ప్రధాన ద్రవ్యోల్బణం, US GDP వృద్ధి అంచనాలను కూడా కొద్దిగా పెంచారు. 

ఈనేపధ్యంలో ఈరోజు అంటే గురువారం(మార్చి 21) సానుకూల ప్రపంచ మార్కెట్ సూచనల నేపథ్యంలో దేశీయ ఈక్విటీ ఇండెక్స్ (Stock Market Report)లు లాభాలతో ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. నిక్కీ తాజా ఆల్-టైమ్ గరిష్టాలను తాకడంతో ఆసియా మార్కెట్లు ఎక్కువ బిజినెస్ చేశాయి.  US ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన సమావేశం ఫలితాల మద్దతుతో US స్టాక్ సూచీలు కూడా రాత్రిపూట రికార్డు స్థాయిలో ముగిశాయి. ఈ పరిణామాల ఆధారంగా మన స్టాక్ మార్కెట్లు(Stock Market Report) లాభాల్లో ప్రారంభం కావచ్చనీ.. సానుకూలంగా ఉండొచ్చనీ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఈరోజు కొనవచ్చని నిపుణులు సూచిస్తున్న స్టాక్స్ ఇవే.. 

  • హిందుస్తాన్ లైన్ వెబ్సైట్ ప్రకారం.. GAIL (I) (₹190.85), అవంతి ఫీడ్స్ (₹529.10), ఉషా మార్టిన్ (₹330.35), BEL (₹205.7), టాటా కమ్యూనికేషన్స్ (₹1,908.90), LIC హౌసింగ్ ఫైనాన్స్ (₹659.25), CAMS (₹3,112.50),డేటా ప్యాటర్న్స్ (భారతదేశం) (₹2,238.60) స్టాక్స్ కొనుగోలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
  • లైవ్ మింట్ వెబ్సైట్ లో ప్రభుదాస్ లిల్లాధర్‌లోని టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ అంచనా ప్రకారం..  1> SBI: ₹ 736 వద్ద, 2> కోల్గేట్ పామోలివ్: ₹ 2664 వద్ద, 3> ఢిల్లీవెరీ: ₹ 463.50 వద్ద కొనవచ్చు. 

Also Read: స్టాక్ మార్కెట్ లో ఒక్కరోజులో 5 లక్షల కోట్లు ఆవిరి.. మరి ఈరోజు ఎలా ఉండొచ్చు?

గత సెషన్ లో స్వల్ప లాభాలు..
Stock Market Report: గత సెషన్ లో అంటే మార్చి 20న స్టాక్ మార్కెట్‌లో స్వల్ప పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 72,101 వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ కూడా 21 పాయింట్లు లాభపడి 21,839 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 20 లాభపడగా, 10 క్షీణించాయి.  ఆటో, పవర్ షేర్లలో మరింత పెరుగుదల కనిపించింది. మారుతీ షేర్ రూ.12,025 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. అయితే దీని తర్వాత స్వల్పంగా తగ్గి రూ.328.20 (2.83%) రూ.11,925 వద్ద ముగిసింది.

నిన్నటి సెషన్ లో టాప్ 5 గెయినర్స్.. 

  • మారుతీ సుజుకీ ఇండియా  11,941.80 (2.97%)
  • పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ 264.55 (2.16%)
  • నెస్లే ఇండియా 2,548.80(2.09%)
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 736.30(1.83%)
  • ITC  415.85

టాప్ 5 లూజర్స్.. 

  • టాటా స్టీల్ 145.70(-1.98%)
  • ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్ 560.75(-2.18%)
  • అశోక్ లేలాండ్ 161.60(-0.22%)
  • క్రాంప్టన్ గ్రీవ్స్ 264.65 (-0.90%)
  • జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ 140.70 (-0.14%)

గమనిక: ఈ ఆర్టికల్ కేవలం పాఠకుల అవగాహన కోసం ఇచ్చినది. ఇక్కడ ఇచ్చిన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు మార్కెట్ వెబ్సైట్ ఆధారితం. ఈ ఆర్టికల్ ఎక్కడైనా పెట్టుబడి పెట్టమని కానీ, ఫలానా స్టాక్ ఎంచుకోమని కానీ సూచించడం లేదు. ఏదైనా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి రిస్క్ తో కూడినది అయి ఉంటుంది. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీ ఆర్ధిక సలహాదారుని సూచనలు తీసుకుని ముందడుగు వేయాలి.

#stock-market #stock-market-review
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe