Stock Market News: అమ్మకాల ఒత్తిడి.. స్టాక్ మార్కెట్ క్రాష్.. ఎందుకంటే.. 

ఈరోజు అంటే మంగళవారం (జనవరి 9) స్టాక్ మార్కెట్ బుల్లిష్ పెరుగుదలను చూస్తోంది. సెన్సెక్స్ 415 పాయింట్ల లాభంతో 71,770 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో, నిఫ్టీలో 140 పాయింట్ల పెరుగుదల ఉంది, ఇది 21,653 స్థాయి వద్ద ప్రారంభమైంది.

New Update
Stock Market Today : స్టాక్ మార్కెట్ పరుగులు..ఆల్ టైమ్ హై కి సెన్సెక్స్.. నిఫ్టీ!

Stock Market News: కష్టపడి డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే.. దానిని జాగ్రత్తగా ఖర్చు చేసి కొంత మొత్తం పొదుపు చేయడం మరో ఎత్తు. పొదుపు చేసిన డబ్బును జాగ్రత్తగా మదుపు చేయడం చాలా కష్టమైనా పని. పెట్టుబడి పెట్టినపుడు రిస్క్ ఉంటుంది. రిస్క్ తీసుకునైనా సరే.. డబ్బును సంపాదించాలి అనుకునే వారు స్టాక్ మార్కెట్ వైపు చూస్తారు.  అయితే, స్టాక్ మార్కెట్ అనేది పూర్తి అస్థిరత తో ఉండే ప్రదేశం. ఒక్క నిమిషంలో మన డబ్బు డబుల్ అయిపోవచ్చు.. మరో నిమిషంలోనే ఒక్క రూపాయి మిగలకుండా ఊడ్చుకుపోవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే.. జాగ్రత్తగా ఆచి తూచి.. నిపుణుల సలహాలు తీసుకుని.. కొంత రీసెర్చ్ చేసి చేయాల్సి ఉంటుంది.  దీనికోసం ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను(Stock Market News) ప్రతిరోజూ అంచనా వేసుకుంటూ ఉండాలి.  ప్రతిరోజూ మార్కెట్ మొదలయ్యే ముందు నిన్నటి రోజున మార్కెట్ తీరుతెన్నులపై ఒక రివ్యూ చేసుకోవడం అవసరం. అంచనాలకు అందకుండా కదిలే స్టాక్ మార్కెట్ నిన్న మార్కెట్ ముగిసే సరికి ఎలా ఉందొ.. టాప్ గెయినర్స్ ఎవరో.. టాప్ లూజర్స్ ఎవరో మీకోసం అందిస్తోంది RTV. 

ఈరోజు స్టాక్ మార్కెట్ (Stock Market News)ప్రారంభ సమయంలో ఈ విషయాలని ఒకసారి పరిశీలించడం స్టాక్ ఇన్వెస్టర్స్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిన్నటి అంటే గురువారం నాటి స్టాక్ మార్కెట్ కదలికలపై ఓ లుక్కేద్దాం.    

 గత ట్రేడింగ్ సెషన్ లో స్టాక్ మార్కెట్(Stock Market News) పైకి దూసుకుపోయింది.  అయితే… నిన్న  అంటే సోమవారం (జనవరి 8) స్టాక్ మార్కెట్‌లో భారీ తగ్గుదల  కనిపించింది. సెన్సెక్స్ 671 పాయింట్లు పడిపోయింది. దీంతో  71,355 వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ కూడా 198 పాయింట్లు నష్టపోయింది.  చివరికి 21,513 పాయింట్ల వద్ద నిలిచింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 క్షీణించగా, 6 షేర్లు మాత్రమే లాభాలను చూశాయి. (Stock Market News) రియల్ ఎస్టేట్, మీడియా  షేర్లలో మాత్రమే పెరుగుదల ఉంది.

Also Read: పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే.. 

ప్రపంచ స్టాక్ మార్కెట్లలో(Stock Market News) ప్రతికూలతలు కనిపించడం.. దేశేయంగా డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను కంపెనీలు ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్స్ లాభాలను తీసుకోవడానికి మొగ్గు చూపించారు. ఎందుకంటే, రాబోయే త్రైమాసిక ఫలితాలు పెద్దగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం లేదనే అభిప్రాయం మార్కెట్లో గట్టిగా ఉందని.. దీంతో మార్కెట్ కిందికి పడిపోయిందని నిపుణులు అంటున్నారు. ఇక అమెరికాలో పెరోల్ డేటా అంచనాలకు మించి నమోదు అయింది. అలానే అక్కడ ఫెడ్ వడ్డీ రేట్లు ఇప్పుడప్పుడే తగ్గించడం లేదనే వార్తలు కూడా మన మార్కెట్(Stock Market News) పై ప్రభావం చూపించాయని భావిస్తున్నారు. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో సెన్సెక్స్ 725 పాయింట్ల వరకూ దిగజారింది. అలాగే నిఫ్టీ కూడా 218 పాయింట్లు కిందకు దిగి ఇంట్రా డే కనిష్టాలను తాకింది. 

ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ స్టాక్స్(Stock Market News) బాగా నష్టపోయాయి. మెక్వైర్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంకులపై రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఆ ప్రభావం బ్యాంకింగ్ షేర్లపై కనిపించింది. దీంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఎస్‌బీఐ 2%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, కోటక్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1.51% నష్టపోయాయి. 

నిన్న స్టాక్ మార్కెట్లో లాభపడ్డ, నష్టపోయిన టాప్ 5 షేర్లు ఇవే.. 

NSE Top 5 Gainers:

Trident, Capri Global, JBM Auto, Alok Industries, Garware Tech

NSE Top 5 Loosers:

Bandhan Bank, Navin Flyorine, Wockhardt, Hind Copper, Sun Pharma

BSE Top 5 Gainers:

Tredent, Capri Global, JBM Auto, Alok Industries, Garware Tech

BSE Top 5 Loosers:

Bandhan Bank, JP Associates, Sun Pharma, Hind Copper, Wokchardt

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు