Stock Market Holiday: అయోధ్య వేడుక.. స్టాక్ మార్కెట్ సెలవు.. ఈ ఏడాది ఎన్ని సెలవులున్నాయంటే.. 

అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట వేడుక కారణంగా ఈరోజు స్టాక్ మార్కెట్లు పనిచేయడం లేదు. ఈరోజు జరగాల్సిన ఆర్ధిక లావాదేవీలన్నీ రేపు అంటే జనవరి 23న జరుగుతాయని ఆర్బీఐ తెలిపింది. మొన్న శనివారం స్టాక్ మార్కెట్ పనిచేసింది. ఆరోజు మార్కెట్ ఇండెక్స్ లు లాభాలను నమోదు చేశాయి. 

New Update
Stock Market Holiday: అయోధ్య వేడుక.. స్టాక్ మార్కెట్ సెలవు.. ఈ ఏడాది ఎన్ని సెలవులున్నాయంటే.. 

Stock Market Holiday: భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ కు దూరంగా ఉన్నాయి. అయోధ్య రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వేడుకగా ఈరోజు అంటే జనవరి 22న జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం పలు రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోజు సెలవు ఇచ్చింది. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ కి కూడా సెలవు(Stock Market Holiday) ప్రకటించారు. సోమవారం అంటే ఈరోజు జాగాల్సిన ట్రేడింగ్ కు బదులుగా మొన్న అంటే శనివారం, 20 జనవరిన స్టాక్ మార్కెట్ పూర్తి స్థాయిలో పనిచేసింది. 

స్టాక్ మార్కెట్ సెలవు (Stock Market Holiday)కారణంగా ఈరోజు NSE, BSEలు రెండూ పనిచేయడం లేదు.  ఆర్బీఐ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం జనవరి 22, 2024 సోమవారం ప్రభుత్వ సెక్యూరిటీలు అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్, మనీ మర్కెట్స్ అన్నిటిలోనూ ఎటువంటి సెటిల్మెంట్స్ లేదా ట్రాన్సాక్షన్స్ జరగవు. ఒకవేళ ఏదైనా సోమవారం క్లియరెన్స్ అవ్వాల్సిన వ్యవహారాలు ఉంటె కనుక వై జనవరి 23, 2024 అంటే మంగళవారానికి వాయిదా పడతాయి. 

Also Read: తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. 

నిజానికి పండుగలు, ఇతర సెలవుదినాలుగా(Stock Market Holiday) ఈ సంవత్సరం 14 రోజులను ప్రకటించారు. శని, ఆదివారాలు కాకుండా ఈ 14 రోజులు స్టాక్ మార్కెట్ పనిచేయదు. ముందుగా ప్రకటించిన లిస్ట్ లో ఈ హాలీడే లేదు. అందుకే శనివారం ట్రేడింగ్ నిర్వహించి.. సోమవారం సెలవు దినం(Stock Market Holiday)గా ప్రకటించారు. మన స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

ఇక ఈ నెలలో 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా కూడా మన స్టాక్ మార్కెట్ పనిచేయదు. ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్ కు  ప్రకటించిన సెలవు రోజులు(Stock Market Holiday) ఇలా ఉన్నాయి. 

  1. జనవరి 26, 2024: శుక్రవారం, గణతంత్ర దినోత్సవం
  2. మార్చి 8, 2024: శుక్రవారం, మహాశివరాత్రి
  3. మార్చి 25, 2024: సోమవారం, హోలీ
  4. మార్చి 29, 2024, శుక్రవారం, గుడ్ ఫ్రైడే
  5. ఏప్రిల్ 11, 2024: గురువారం, ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్)
  6. ఏప్రిల్ 17, 2024: బుధవారం, రామ నవమి
  7. మే 1, 2024: బుధవారం, మహారాష్ట్ర దినోత్సవం
  8. జూన్ 17, 2024: సోమవారం, బక్రీద్
  9. జూలై 17, 2024: బుధవారం, మొహర్రం
  10. ఆగస్టు 15, 2024: గురువారం, స్వాతంత్ర  దినోత్సవం/పార్సీ నూతన సంవత్సరం
  11. అక్టోబర్ 2, 2024: బుధవారం, మహాత్మా గాంధీ జయంతి
  12. నవంబర్ 1, 2024: శుక్రవారం, దీపావళి లక్ష్మీ పూజ*
  13. నవంబర్ 15, 2024: శుక్రవారం, గురునానక్ జయంతి
  14. డిసెంబర్ 25, 2024: బుధవారం, క్రిస్మస్

కాగా, శనివారం రోజు ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్ పనిచేసింది. ఆరోజు దేశీయ ‍స్టాక్‌ ఎక్ఛేంజీల ఇండెక్స్ లు ట్రేడింగ్‌ సెషన్‌లో రికార్డు మార్క్‌లను తాకాయి. సెన్సెక్స్‌ 321.32 పాయింట్లు లాభపడి 71,508.18 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఇండెక్స్‌ నిఫ్టీ 123.45 పాయింట్లు పెరుగుదలతో ఎగిసి 21,585.70 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.

కోల్‌ఇండియా, అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజస్‌, కొటాక్‌ మహీంద్ర, ఐసీఐసీ బ్యాంకు షేర్లు మంచి లాభాలతో టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, మహీంద్ర&మహీంద్ర, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ కంపెనీ షేర్ల నష్టాలను మూటకట్టకుని టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు