Stock Market Crash: డౌన్ ట్రెండ్ లో స్టాక్ మార్కెట్.. భారీగా పడిపోయిన ఇండెక్స్ లు

ఈరోజు స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. మార్కెట్ ప్రారంభం నుంచే ఇండెక్స్ లు కింది చూపులు చూశాయి. 11:30 గంటల సమయానికి సెన్సెక్స్ 850 పాయింట్లు నష్టపోయి 81,350 వద్ద ఉంది. ఇక నిఫ్టీ 250 పాయింట్లు పడిపోయి 24,880 దగ్గర ట్రేడ్ అవుతోంది. 

New Update
Stock Market Trends : స్టాక్ మార్కెట్ పతనం నుంచి కోలుకుంటుందా? ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి?

Stock Market Crash: వారంలో చివరిరోజు స్టాక్ మార్కెట్ కుదేలవుతోంది. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు కిందికి పడిపోయాయి. 11:30 గంటల సమయానికి సెన్సెక్స్ 850 పాయింట్లకు పైగా పతనం అయింది. దీంతో 81,350 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 250 పాయింట్ల నష్టంతో  24,880 వద్ద ట్రేడవుతోంది.

Stock Market Crash: 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో దాదాపు అన్ని స్టాక్స్ అంటే 28 స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  2 స్టాక్స్ మాత్రమే కొద్దిపాటి లాభాలను చూస్తున్నాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో కూడా పరిస్థితి అలానే ఉంది. ఇక్కడ 47 నష్టపోతుండగా.. కేవలం మూడు మాత్రమే లాభాలను చూస్తున్నాయి. NSE అన్ని సెక్టార్స్ ఇండెక్స్ లు కూడా లో ట్రెండ్ లోనే ఉన్నాయి.  ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు ఎక్కువగా పడిపోయాయి.

ఆసియా మార్కెట్‌లో మిశ్రమ వ్యాపారం

  • ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 0.24%, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ 0.075% క్షీణించాయి. చైనా షాంఘై కాంపోజిట్ 0.11%, కొరియా కోస్పి 0.86% పడిపోయాయి.
  • NSE డేటా ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) సెప్టెంబర్ 5న ₹688.69 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ కాలంలో, దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) ₹ 2,970.74 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

ఈవార్త అప్ డేట్ అవుతోంది . .

Advertisment
తాజా కథనాలు