కొత్త పన్ను విధానంలో రిలీఫ్.. పాత పన్ను విధానంలో నో ఛేంజ్

కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. టాక్స్ స్టాండర్డ్ రిడక్షన్ పరిమితిని 50 వేల నుంచి 75 వేల రూపాయలకు పెంచింది.

New Update
Budget-Students: బడ్జెట్‌ లో విద్యార్థులకు తీపికబురు.. విద్యా రుణాలపై!

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెద్ద రిలీఫ్ ఇచ్చింది. స్టాండర్డ్ డిడక్షన్ ను 50 వేల రూపాయల నుంచి 75 వేల రూపాయలకు పెంచింది.

కొత్త పన్ను విధానంలో శ్లాబ్‌లను మార్చారు. అవి ఇలా ఉన్నాయి..

  • రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం
  • రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం
  • రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం
  • రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం
  • రూ.15 లక్షలకు మించి ఆదాయంపై 30 శాతం పన్ను
  • శ్లాబ్‌ల్లో మార్పుల వల్ల ఉద్యోగులకు రూ.17,500 ఆదా అవుతుంది

అయితే పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పు చేయలేదు. ఇది పాత పన్ను విధానంలో కొనసాగుతున్న ఉద్యోగులకు ఇబ్బందికరమే అని చెప్పాలి. వారు ఈ బడ్జెట్ లో ఊరట ఉంటుందని ఆశించారు. మొత్తంగా చూసుకుంటే టాక్స్ పేయర్స్ పట్ల నిర్మలా సీతారామన్ పెద్దగా కనికరం చూపలేదనే చెప్పాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు