Steve Jobs: స్టీవ్ జాబ్స్ రాసిన ప్రకటన లేఖ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?

ఆపిల్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో తెలిసిందే. ఆ సంస్థ నుంచి వచ్చే ప్రతి వస్తువు కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. అంతేకాదు ఆపిల్‌కు సంబంధించిన పాత వస్తువులను వేలంలో భారీ ధర చెల్లించి మరి సొంతం చేసుకుంటూ ఉంటారు. అంతలా ప్రజల మనసు దోచుకోవడానికి కారణం ఆ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్.

Steve Jobs: స్టీవ్ జాబ్స్ రాసిన ప్రకటన లేఖ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?
New Update

1976లో ప్రకటన లేఖ రాసిన జాబ్స్..

ఆపిల్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో తెలిసిందే. ఆ సంస్థ నుంచి వచ్చే ప్రతి వస్తువు కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. అంతేకాదు ఆపిల్‌కు సంబంధించిన పాత వస్తువులను వేలంలో భారీ ధర చెల్లించి మరి సొంతం చేసుకుంటూ ఉంటారు. అంతలా ప్రజల మనసు దోచుకోవడానికి కారణం ఆ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్. ఇదంతా ఎందుకు చెబుతానంటే ప్రజల్లో స్టీవ్ జాబ్స్‌తో పాటు ఆపిల్ కంపెనీకి ఎంత డిమాండ్ ఉందో మరోసారి రుజువైంది. 1976వ సంవత్సరంలో ఆపిల్-1 కంప్యూటర్‌ మార్కెటింగ్ ప్రకటన కోసం స్టీవ్ తన స్వహస్తాలతో ఓ లేఖ రాశారు. ఇందులో స్టీవ్ జాబ్స్ సంతకం కూడా ఉంది. ఆ లేఖలో తన తల్లిదండ్రుల ఇంటి అడ్రస్, ఫోన్ నంబరును కూడా పేర్కొన్నారు.

వేలంలో రూ.1.4కోట్లు పలికిన లేఖ..

ఈ లేఖ ఆపిల్ సంస్థకు చెందిన ఆ మొట్టమొదటి వాణిజ్య ప్రకటన కావడం విశేషం. 8.5x11 బైండర్ షీట్‌పై నలుపు సిరాతో దీనిని జాబ్స్ రాశారు. ఇందులో ఆపిల్-1 కంప్యూటర్‌కు సంబంధింని స్పెషిఫికేషన్‌లను మెన్షన్ చేశారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఒరిజినల్ కాపీని ఆర్ఆర్ ఆక్షన్ కంపెనీ తాజాగా వేలం వేసింది. ఈ లేఖ కోసం వేలంలో గట్టి పోటీ నెలకొంది. అయితే చివరకు ఓ వ్యక్తి దీనిని రూ.1.4 కోట్లకు దక్కించుకున్నాడు. అనుకున్న దాని కంటే ఆరు రెట్లు ఎక్కువగా ధర పలికిందని వేలం నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రకటన టెక్ చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచిపోయింది. బిలియన్ డాలర్ల కంపెనీ మొదటి ప్రధాన కార్యాలయం(సబర్బన్ గ్యారేజీ)లో ఈ లేఖ ఉంది. ఈ ప్రకటన మొదటగా జూలై 1976 ఎడిషన్ ఇంటర్‌ఫేస్ మ్యాగజైన్‌లో ప్రచురించబడింది.

ప్రకటనలో ఆపిల్-1 కంప్యూటర్ వివరాలు..

ఆపిల్-1 కంప్యూటర్‌లో 6800, 6501 లేదా 6502 మైక్రోప్రాసెసర్‌ని ఉపయోగిస్తున్నట్లు లేఖలో వివరించారు. కానీ బేసిక్ మోడల్ కారణంగా 6501 లేదా 6502 కోసం సిఫార్సు చేయబడిందని తెలిపారు. 8K బైట్‌ల RAM, పూర్తి CRT టెర్మినల్-ఇన్‌పుట్, మిక్స్‌డ్‌ వీడియో అవుట్‌పుట్, ఎడ్జ్ కనెక్టర్ ద్వారా 65Kకి పూర్తి విస్తరణతో సహా కంప్యూటర్ సాంకేతిక వివరణలను కూడా ఈ ప్రకటనలో వివరించారు. అందుకే ఈ ప్రకటన లేఖకు అంత డిమాండ్ ఏర్పడింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి