AP: డ్రగ్స్ నియంత్రించాలి.. లేదంటే యువతకి ముప్పు తప్పదు: రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్

విజయనగరం జిల్లా విద్యాసంస్థల్లో డ్రగ్స్ నియంత్రించేందుకు రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టకపోత రానున్న రోజుల్లో యువతకి ముప్పు తప్పదన్నారు. విద్యార్థి దశలోనే డ్రగ్స్ పై అవగాహన ఉండాలన్నారు.

New Update
AP: డ్రగ్స్ నియంత్రించాలి.. లేదంటే యువతకి ముప్పు తప్పదు: రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్

Vizianagaram: విజయనగరం జిల్లాలో విద్యాసంస్థల్లో డ్రగ్స్ నియంత్రించేందుకు రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న అన్ని కళాశాల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశారు. మత్తు పదార్థాలకు యువత బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు.

డ్రగ్స్ మహమ్మారిని అరికట్టకపోతే రానున్న రోజుల్లో యువతకి ముప్పు తప్పదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28 డిపార్ట్మెంట్ లో తమ డిపార్ట్మెంట్ తరఫున డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థి దశలోనే కమిటీలు వేసి డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు.

Advertisment
తాజా కథనాలు