కౌంటింగ్‌కు ముందే పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్స్‌లు తెరిచిన సిబ్బంది.. వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లో కౌంటింగ్‌కు ముందే పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులు తెరుచుకోవడం కలకలం రేపుతోంది. స్ధానిక ఎన్నికల అధికారులు ఈ బాక్స్ ను తెరవడంపై మండిపడుతున్న కాంగ్రెస్ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది.

కౌంటింగ్‌కు ముందే పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్స్‌లు తెరిచిన సిబ్బంది.. వీడియో వైరల్
New Update

మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. కాగా వచ్చే నెల 3న ఐదు రాష్ట్రాలతోపాటు అక్కడ కూడా ఓట్ల లెక్కింపు జరగబోతోంది. దీంతో బాలాఘాట్ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని స్ట్రాంగ్‌రూమ్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచారు అధికారులు. అయితే కొందరు సిబ్బంది ఆ బాక్సులను తెరిచి చూసినట్లు తెలుస్తోంది. దీంతో కలెక్టర్‌ అనుమతితోనే ఇదంతా జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ట్ పార్టీ బాలాఘాట్‌ కలెక్టర్‌ గిరీష్‌ కుమార్‌ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Also read :Telangana Elections 2023: రానుంది బీఎస్పీ సర్కారే.. పెద్దపల్లిలో గెలిచేది నేనే.. దాసరి ఉష సంచలన ఇంటర్వ్యూ..!!

ఈ మేరకు కౌంటింగ్‌కు ముందు పోస్టల్ బ్యాలెట్లను తెరచిన వీడియో బయటపడిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ఇప్పటికే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో సదరు బ్యాలెట్ ఓట్లను ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశం. ఈ చర్యలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండా కొందరు సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులను ఓపెన్‌ చేశారు. ఓటమి భయంతోనే భాజపా ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది. అధికార పార్టీకి మేలు చేకూర్చేలా సిబ్బంది వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం’’ అని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ట్వీట్ చేసింది. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. దీనికి సంబంధించి డివిజనల్ కమిషనర్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ‘‘బాలాఘాట్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులను కలెక్టర్‌ కార్యాలయంలోని స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచాం. ప్రతిరోజూ పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులు వస్తుండటంతో.. 50 బ్యాలెట్లను ఒక బండిల్‌గా ఉంచుతున్నాం. స్ట్రాంగ్‌రూమ్‌ను ప్రతిసారీ పార్టీ ప్రతినిధుల సమక్షంలోనే తెరుస్తున్నాం. ఈ ప్రక్రియ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో జరుగుతోందని తెలిపారు. ఇక మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈసారి హోరాహోరీ పోరు సాగినట్లు ఎన్నికల సరళి బట్టి తెలుస్తోంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న బీజేపీని కాదని కాంగ్రెస్ కు ఈసారి ఓటర్లు పట్టం కట్టబోతున్నట్లు ఒపీనియన్ పోల్స్ కూడా తేల్చేశాయి.

#postal-ballot-boxes #madhya-pradesh #opened
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe