SSC Stenographer Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఉద్యోగాల కోసం పోటిపడే యువత మనదేశంలో ఎక్కువగా ఉంటుంది. UPSC తర్వాత ఎక్కువగా స్టాఫ్ సెలక్షన్ జాబ్స్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు అభ్యర్థులు. ఇక ప్రతి ఏడాదిలాగే SSS నుంచి వివిధ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుండగా.. తాజాగా కమిషన్ నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. గ్రేడ్ C(Grade C), గ్రేడ్ D(Grade D)లోని స్టెనోగ్రాఫర్‌ల నియామకల కోసం SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేడ్ 'సీ'కి 93, గ్రేడ్ 'డి' స్టెనోగ్రాఫర్ పోస్టులకు 1,114 చొప్పున మొత్తం 1,207 ఖాళీలను ప్రకటించారు. ఎంపిక ప్రక్రియలో ఓపెన్, కాంపిటేటివ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. స్టెనోగ్రఫీ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ముఖ్యమైన తేదీలు:
🅐 దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 2
🅑 దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 23
🅒 దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు తేదీ: ఆగస్టు 24–25
🅓 గ్రేడ్ C, గ్రేడ్ D ఆఫీసర్లకు పరీక్ష తేదీ: అక్టోబర్ 12, 13.
➡ అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
➼ వయసు:
• ఆగస్టు 1నాటికి స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి) పోస్టులకు 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిఫెన్స్ పర్సనల్ అభ్యర్థులకు 3 సంత్సరాలు, డిఫెన్స్ (డిసెబుల్డ్) పర్సనల్ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 8 సంత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
‣కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (ఎస్సీ, ఎస్టీ) 45 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
• వితంతు-విడాకులు-ఒంటరి మహిళలకు 35 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీలకు 40 సంవత్సరాల వరకు వయోపరిమితి వర్తిస్తుంది.
‣దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
‣ ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
‣ SSC స్టెనోగ్రాఫర్ 2023 కోసం విద్యా అర్హత - SSC Stenographer Education Qualification:
దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 12వ తరగతి లేదా తత్సమాన విద్యను ఉత్తీర్ణులై ఉండాలి.
‣ SSC (Grade C and D) స్టెనోగ్రాఫర్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి దశలు:
1. అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ ని సందర్శించండి
2. లాగిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోండి.
3. మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
4. స్టెనో ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
5. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి. అవసరమైన అన్ని వివరాలను పూరించండి.
6. ఫీజు చెల్లించండి.
7. ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
8. కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.