Roja: తిరుమలలో మంత్రి రోజాకి రాజధాని సెగ.. జై అమరావతి అంటూ నినాదాలు..! తిరుమలలో మంత్రి రోజాకి రాజధాని సెగ తగిలింది. శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చిన రోజాను శ్రీవారి సేవకులు చుట్టుముట్టారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మంత్రి రోజాను కూడా అమరావతికి జై కొట్టండి మేడం అంటూ కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 02 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Minister Roja: ఏపీ మంత్రి రోజా తరచూ తిరుమల శ్రీవారిని దర్శంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి శ్రీవారిని దర్శించుకొవడానికి వెళ్లిన మంత్రి రోజాకు రాజధాని సెగ తగిలింది. శ్రీవారిని దర్శనం అనంతరం బయటకు వచ్చారు మంత్రి రోజా. అదే సమయంలో శ్రీవారి సేవకులుగా అక్కడ ఉన్న కొందరు మహిళలు ఆమెను చుట్టుముట్టారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మంత్రి రోజాను కూడా అమరావతికి జై కొట్టండి మేడం అంటూ కామెంట్స్ చేశారు. అయితే, మంత్రి రోజా మాత్రం నవ్వుతూ సైలెంట్ గా వెళ్లిపోయారు. కాగా, ఏపీకి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి ఉన్న సంగతి అందరికి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి రాజధాని అమరావతే అంటూ ప్రకటించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ జగన్ కూడా అందకు ఓకే అన్నారు. రాజధానికి భూములు కావాలంటూ ఆ ప్రాంతంలో ఉన్న రైతులను ఒప్పించి వారి నుండి భూములు సేకరించింది టీడీపీ ప్రభుత్వం. ఆ తరువాత వైసీపీ ప్రభ్వుతం అధికారంలోకి వచ్చింది. Also Read: భద్రాచలంలో అమానుష ఘటన.. పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు సృష్టించి ఏం చేశారంటే? ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ అమరావతి రైతులకు పెద్ద షాక్ ఇచ్చారు. దీంతో, వైసీపీ ప్రభుత్వంపై భూములు ఇచ్చిన అమరావతి రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీకి రాజధానిగా అమరావతే ఉండాలని పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు, పోరాటలు చేశారు. మూడు రాజధానిల విషయంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఇలా ఏపీ రాజధాని విషయం వివాదంగా మారింది. కేసు ఇంకా విచారణలోనే ఉంది. తాజాగా, తిరుమల వేదికగా అమరావతి నినాదాలు చేయటంతో మరోసారి ఈ అంశం వివాదాస్పదంగా మారుతున్నట్లు తెలుస్తోంది. #andhra-pradesh #minister-rk-roja మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి